breaking news
imposed
-
Nepal: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్
ఖాట్మండు: నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్‌చాట్ తదితర 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్(1990ల చివరలో, 2000 ప్రారంభంలో జన్మించినవారు) నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. #Nepal Curfew imposed following protests in Kathmandu. Gen Z has taken out protest against corruption by old guards. https://t.co/HVtOVAe4K7— Vidushi (@VidushiTri20209) September 8, 2025దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఖాట్మండు జిల్లా పరిపాలన సోమవారం న్యూ బనేశ్వర్, చుట్టుపక్కల ప్రాంతాలలో కర్ఫ్యూ విధించింది. నిరసనలో పాల్గొన్న వేలాది మంది యువకులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులు నిషేధిత ప్రాంతంలోకి చొరబడటంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఖాట్మండు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చాబిలాల్ రిజల్ సోమవారం మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. -
‘పుతిన్ తలొగ్గేలా చేస్తాం’.. అమెరికా మరో వార్నింగ్
న్యూయార్క్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై వాషింగ్టన్, యూరోపియన్ యూనియన్లు మరిన్ని ద్వితీయ ఆంక్షలు విధించినట్లయితే రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఎన్సీబీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సమావేశం నిర్వహించారని, దీనిలో అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు రష్యాపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఏమి చేయవచ్చో చర్చించారని తెలిపారు.ట్రంప్ యంత్రాంగం గతంలో ప్రకటించిన 25 శాతం పరస్పర సుంకాలకు అదనంగా భారత్ రష్యా చమురు కొనుగోలుచేస్తున్నందుకు మరో 25 శాతం సుంకాన్ని విధించింది. భారత్‌పై విధించిన మొత్తం సుంకాలు ఆగస్టు 27 నుండి అమలులోకి వచ్చాయి. కాగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని, అయితే యూరోపియన్ భాగస్వాములు అందుకు సహకరించాలని స్కాట్ బెసెంట్ అన్నారు.తమ ఒత్తిడికి ఉక్రెయిన్ సైన్యం ఎంతకాలం నిలబడగలదు? రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం నిలుస్తుంది? అనే దాని మధ్య పోటీ జరుగుతున్నదన్నారు.అమెరికా, ఈయూలు జోక్యం చేసుకుని రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించగలిగితే రష్యన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని, అప్పుడైనా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు వస్తారని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా విధించిన సుంకాలను భారత్ అన్యాయమైనవి, అసమంజసమైనవని పేర్కొంది. -
పెరుగుతున్న ఉల్లి ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఉల్లిపై కేంద్రం ఎగుమతి సుంకం విధించడం ఇదే తొలిసారి. వంటల్లో ప్రధానంగా ఉపయోగించే ఉల్లి ధర ప్రస్తుతం (ఆగస్ట్ 19) ఢిల్లీలో కిలోకు రూ. 37కి చేరింది. 2023 డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు భారత్ నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి. విలువ పరంగా చూస్తే వీటిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న మొదటి మూడు దేశాలు బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం.. ఆగస్ట్ 19న దేశంలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు కనిష్టంగా రూ. 30గా ఉంది. ఇది గరిష్టంగా రూ. 63, కనిష్టంగా రూ. 10లుగా ఉంది. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ సిద్ధం
-
Afghanistan: అటు తాలిబాన్.. ఇటు ఇరాన్.. మధ్యలో ఇండియా
సాక్షి, వెబ్‌డెస్క్: అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది. అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్టర్నేట్ మిడిల్ ఈస్ట్ ఏషియా, యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్లో చబహార్పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇండియా ముందుకు వచ్చింది. ఈ పోర్టుకి అనుసంధానంగా రైలు, రోడ్డు ప్రాజెక్టును నిర్మించడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఇండియా ప్రణాళిక రూపొందించింది. అమెరికా సైతం ఈ ప్రాజెక్టుకు సానుకూలంగానే స్పందించింది. హైవే నిర్మాణం అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం పేరుతో 150 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్ - దేలారమ్ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. రైలు మార్గానికి సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి. ఇక చబహార్ పోర్టు ప్రస్తుత సామర్థ్యం 8 మిలియన్ టన్నులు ఉండగా దాన్ని 80 మిలియన్ టన్నులకు పెంచేలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఇండియా తీసుకుంది. తద్వారా భవిష్యత్తులో పోర్టు ద్వారా వచ్చే ఆదాయంలో ఇరాన్ - ఇండియాలు షేర్ చేసుకోవాలనే ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై ఆంక్షలు ప్రపంప పెద్దన్న హోదాలో న్యూక్లియర్ డీల్ విషయంలో ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది అమెరికా. దీంతో ఇరాన్లో ఇండియా చేపట్టిన చబహార్ పోర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపించలేదు. కనీసం క్రేన్లు సరఫరా చేసేందుకు సైతం ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. ఇరవై సార్లకు పైగా టెండర్లు పిలిచినా నిరాశే మిగిలింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో హైవే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చబహార్ పోర్టు నిర్మాణం పూర్తయి ఉంటే ఈ హైవే వల్ల ఇండియాకు ప్రయోజనం చేకూరి ఉండేది. కానీ అమెరికా ఏకపక్ష ఆంక్షల కారణంగా ప్రత్యక్షంగా ఇరాన్, పరోక్షంగా ఇండియా నష్టపోయాయి. మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగమైన రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పుడు చైనా ఆసక్తి చూపిస్తోంది. పెట్టుబడి వృధాయేనా చబహార్ పోర్టు పేరుతో దాదాపు వన్ బిలియన్ డాలర్ల వరకు ఇండియా పెట్టుబడులు పెట్టింది. తాజాగా అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోవడంతో గతంలో జరిగిన ఒప్పందాలు ఎంత మేరకు ఫలితాలను ఇస్తాయంటే సమాధానం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఇండియా అమెరికా ట్రాప్‌లో పడి చబహార్ పోర్డు పనుల్లో చాలా జాప్యం చేసిందనే వాదన ఇరానీయుల నుంచి వినిపిస్తోంది. పూర్తి చేయండి అఫ్ఘనిస్తాన్ పునర్మిణం కోసం ఇండియా చేపట్టిన పనులు పూర్తి చేస్తే మాకేమీ అభ్యంతరం లేదని, సహకారం అందిస్తామంటూ తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ పాక్ మీడియాకు వెల్లడించారు. అదే సమయంలో విదేశీ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఆఫ్ఘన్ నేలను ఉపయోగించుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. దీంతో గాంధర నేలపై ఇండియా పెట్టిన పెట్టుబడులు నిష్ఫలం అయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఢిల్లీలో నిషేధాజ్ఞలు : 144 సెక్షన్ విధింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ 144 ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడడానికి వీల్లేదని, ఇండియా గేటు వద్ద ప్రజలను అనుమతించమని తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఇండియా గేట్ చుట్టూ ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఇండియా గేటు వద్ద సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు. యూపీ హథ్రాస్ జిల్లాలో సామూహిక హత్యాచార ఘటనపై కాంగ్రెస్ నిరసనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యంగా బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇండియా గేట్, శాస్త్రి భవన్ సమీపంలో నిరసన ప్రదర్శన అనంతరం ఈ ప్రకటన వచ్చింది గత నెల 28వ తేదీన 20 మంది పంజాబ్ యూత్ కాంగ్రెస్ సభ్యులు ఇండియా గేటు వద్ద కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ట్రాక్టరును దహనం చేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) -
మహా ఉత్కంఠకు తెర : రాష్ట్రపతి పాలనకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర మంత్రిమండలి చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. మంత్రిమండలి తీర్మానాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. నవంబర్ 8న అసెంబ్లీ పదవీకాలం ముగిసినా తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొనడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. గవర్నర్ సిఫార్సును కేంద్ర మంత్రిమండలి ఆమోదించి రాష్ట్రపతికి నివేదించింది. మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన ఫిఫ్టీఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ సమ్మతించలేదు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేసిన ప్రయత్నాలకు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు గవర్నర్ విధించిన డెడ్‌లైన్‌లోగా సహకరించలేదు. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని కోరారు. అయితే తమకు మరో 48 గంటల గడువు కావాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కోరడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలన దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాజ్యంగ బద్ధంగా ప్రభుత్వ ఏర్పాటయ్యే పరిస్థితి లేదని గవర్నర్ స్పష్టం చేశారు. మొత్తంమీద రాష్ట్రపతి పాలనతో రెండు వారాలు పైగా సాగిన మహా డ్రామాకు తెరపడింది. -
ఇక మొత్తానికే మద్యం బంద్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. రెండు మూడు రోజుల కిందట మద్యంపై స్వల్పంగా నిషేధం విధించిన ఆయన ఇక సంపూర్ణ నిషేధ ప్రకటన చేశారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ విధమైన మద్యం విక్రయించినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో ప్రొహిబిషన్ డే సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని, మద్యం కారణంగా చిన్నచిన్న కుటుంబాలే కాకుండా ఎంతోమంది జీవితాలు చిద్రమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రకారమే ఏప్రిల్ 1న తొలుత గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం ప్రకటించారు. 'ఏ బార్లలోనూ, పబ్బుల్లోనూ ఇకనుంచి మద్యం విక్రయాలు జరపరాదు. రాష్ట్రమంతటా మద్యంపై నిషేధం విధించాము. ఇది ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. మహిళలు, పిల్లలు, యువకులు మేం తీసుకున్న ఈ నిర్ణయానికి అనుకూలంగా పనిచేయాలి' అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. ఆర్మీకి మాత్రం ఆయన మినహాయింపును ఇస్తున్నట్లు చెప్పారు. లిక్కర్ బ్యాన్ కారణంగా ఎవరైతే ఉపాధి కోల్పోతున్నారో వారందరి త్వరలోనే మంచి ఉద్యోగ బాట చూపిస్తామని నితీష్ చెప్పారు. తాజాగా, బిహార్ తీసుకున్న నిర్ణయంతో మద్యంపై పూర్తి నిషేధం విధించిన నాలుగో రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటికే నాగాలాండ్, మణిపూర్, గుజరాత్ రాష్ట్రాల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. -
రాష్ట్రపతి పాలన విధించాలి
చెన్నూర్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా తక్షణమే రాష్ట్రపతి పాలన విధించి, సీమాంధ్ర పాలనకు స్వస్తి చెప్పాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాడి రాజన్నయాదవ్, వెంకట్రావ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఏపీఎన్జీవోల సభ కేవలం తెలంగాణ బిడ్డల మీద దాడి చేయడానికే పెట్టారన్నారు. కలిసుండాలని కోరుకునే వార సభలో తెలంగాణ భావ స్వేచ్ఛను చాటిన కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించారు. అలాగే విద్యార్థి సంఘాల నాయకులపై చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు 50 శాతం మధ్యంతర భృతి, ఆరోగ్య కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పీఈటీ, భాష పండితుల పోస్టుల అప్‌గ్రేడేషన్, రూ. 398 పే, ఎసీ, ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాదవ్ కిరణ్‌కుమార్, జాడి మురళి, ఉపాధ్యక్షులు రాజేశ్‌నాయక్, అరుణ్, జంపన్న, మాధవ్ ఉన్నారు.