
ఖాట్మండు: నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్‌చాట్ తదితర 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్(1990ల చివరలో, 2000 ప్రారంభంలో జన్మించినవారు) నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
#Nepal
Curfew imposed following protests in Kathmandu.
Gen Z has taken out protest against corruption by old guards. https://t.co/HVtOVAe4K7— Vidushi (@VidushiTri20209) September 8, 2025
దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఖాట్మండు జిల్లా పరిపాలన సోమవారం న్యూ బనేశ్వర్, చుట్టుపక్కల ప్రాంతాలలో కర్ఫ్యూ విధించింది. నిరసనలో పాల్గొన్న వేలాది మంది యువకులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులు నిషేధిత ప్రాంతంలోకి చొరబడటంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఖాట్మండు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చాబిలాల్ రిజల్ సోమవారం మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు.