తన బిడ్డ జాడ కోసం అడవిలో దారి చూపించిన ఆవు..! | Cow Leads Officials To Save Missing Calf From Tiger Attack In Asifabad, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

తన బిడ్డ జాడ కోసం అడవిలో దారి చూపించిన ఆవు..!

Feb 16 2026 9:15 PM | Updated on Feb 17 2026 1:28 PM

Cow Guides the Way in Search of Missing Calf

అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒక్కటే. అది మనుషుల్లోనైనా, మూగ జీవాల్లోనైనా. ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టీ ఇటిక్యాల పహాడ్‌ లో ఆవు దూడపై పులి దాడి చేసింది. అయితే పశు యజమాని,  అధికారులు.. ఆవు దూడపై పులి దాడి చేసిన చోటును గాలిస్తుండగా, అది చూసిన ఆవు.. వారిని తన వెంట తీసుకెళ్లింది. 

తాను ముందుండి దారి చూపిస్తూ అధికారులను తన వెనకాలే రమ్మన్నట్లగా ముందుకు సాగింది.  ఇలా పులి దాడి చేసిన ప్రాంతానికి తీసుకెళ్లింది.  ఇలా బిడ్డపై తన ప్రేమను చాటుకుంది ఆవు..  అయితే పులి దాడి చేసి ఆ దూడను అప్పటికే మింగేసి ఉండొచ్చు.  కాకపోతే ఆవు ఇలా దారి చూపించి తన బిడ్డను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం మాత్రం అమ్మ ప్రేమకు అద్దం పడుతోంది.. తాను ఆవునే కానీ, అంతకుమించి అమ్మను తెలియజెప్పింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement