
భారతదేశంలో హెచ్‌పీ ఒమెన్ 16ను లాంచ్ చేస్తూ తన గేమింగ్ ల్యాప్‌టాప్ లైనప్‌ను విస్తరించింది. ఈ లేటెస్ట్ ఏఐ గేమింగ్ ల్యాప్‌టాప్ ఎన్‌వీడియా గెఫోర్స్ 12జీబీ ఆర్‌టీఎక్స్‌తో జత చేసిన.. ఐటెల్ కోర్ అల్ట్రా లేదా ఏఎండీ రైజిన్ ఏఐ ప్రాసెసర్‌ను పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.1,29,999.
హెచ్‌పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్ ఇప్పుడు ఆన్‌లైన్ స్టోర్, హెచ్‌పీ వరల్డ్, అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 6 సెల్ 83 వాట్స్ బ్యాటరీ కలిగి ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి గేమింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.
హార్డ్‌వేర్ విషయానికొస్తే.. ఈ ల్యాప్‌టాప్ 16 ఇంచెస్ క్యూహెచ్‌డీ (2560 × 1600) డిస్‌ప్లేను పొందింది. ఇది 500 నైట్స్ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. ఇది 100 శాతం 100 శాతం sRGB కలర్ కవరేజ్.. బ్లూ లైట్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడానికి ఐసేఫ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా థర్మల్ డిజైన్‌లో టెంపెస్ట్ కూలింగ్, ఫ్యాన్ గ్యాప్‌లు, హీట్ ఫేజ్ రీడిస్ట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉన్నాయి.