breaking news
Gachhi Bawli police station
-
పోలీసులకు చిక్కిన హెచ్‌సీయూ ల్యాప్‌టాప్ దొంగలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాప్‌టాప్స్‌ను చోరీ చేసిన దొంగలను గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. సీఆర్ రావు ఎఐఎమ్ఎస్ ప్రాంగణంలో జరిగిన ఈ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం దొంగిలించిన 60 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ (30) తో పాటు, సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19) అనే ఇద్దరు విద్యార్థులు కలిసి ఈ దొంగతానానికి పాల్పడినట్లు గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా పటిష్ట బందోబస్తు ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 8న రాత్రి దొంగతనం జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఈ ఘటనపై ఈ నెల 9న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్లు 331(4), 305(ఎ) కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. -
హెచ్ సీయూ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం ఇటీవలే కాస్త చల్లబడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ)లో మరో విద్యార్థి అదృశ్యం కలకలకం రేపుతోంది. పీహెచ్ డీ చదువుతోన్న డి. సురేశ్ జోసెఫ్(28) కొద్ది రోజులుగా కనిపించకుండాపోవడం విద్యార్థులతోపాటు అధికారులను కలవరపెడుతోంది. ఇదే విషయమై వర్సిటీ అధికారులు గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. తప్పిపోయిన విద్యార్థి సురేశ్ జోసెఫ్ కేరళకు చెందినవాడని, కొద్దికాలంగా అతడి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హెచ్ సీయూ సీఎంఓ రవీంద్ర కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు.


