ఛీ..ఛీ నువ్వు మనిషివేనా? సొంత భార్య‌తో వ్యభిచారం | Man Held For Assisting Over 120 Men To Buy Sex With His Wife In Sweden | Sakshi
Sakshi News home page

ఛీ..ఛీ నువ్వు మనిషివేనా? సొంత భార్య‌తో వ్యభిచారం

Feb 17 2026 12:31 AM | Updated on Feb 17 2026 1:14 AM

Man Held For Assisting Over 120 Men To Buy Sex With His Wife In Sweden

స్వీడ‌న్‌లో ఒక‌ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్ని తానై జీవితాంతం తోడుగా నిల‌వాల్సిన ఓ భ‌ర్త‌.. త‌న భార్య‌ను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టాడు. దాదాపు 120 మంది పురుషులతో ఆమెకు అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసినట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఈ దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించిన వివరాలను ప్రాసిక్యూటర్ ఈడా అన్నర్‌స్టెడ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. 60 ఏళ్ల వయసున్న నిందితుడిని పోలీసులు గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. దాదాపు 50 ఏళ్ల వ‌య‌సున్న‌ అత‌డి భార్య స్వ‌యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. 

విలాసవంత‌మైన జీవితాన్ని అనుభ‌వించేందుకు అత‌డు సొంత భార్య‌నే విటుల‌కు స‌రఫరా చేసిన‌ట్లు అన్నర్‌స్టెడ్  పేర్కొన్నారు. కాగా నిందితుడు తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ  ఖండించినప్పటికీ.. సుమారు రెండేళ్ల పాటు అత‌డు ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

అయితే ఆ సమయంలో ఆమెకు ఏవైనా మత్తు మందులు ఇచ్చారా లేదా ఇతర ఒత్తిళ్లకు గురిచేశారా అనే విషయాలను మాత్రం ప్రాసిక్యూటర్ వెల్ల‌డించ‌లేదు. ఏదేమైన‌ప్ప‌టికి ఈ కేసు ప్రస్తుతం స్వీడన్‌లో సంచలనం సృష్టిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement