prosecutor
-
ఛీ..ఛీ నువ్వు మనిషివేనా? సొంత భార్యతో వ్యభిచారం
స్వీడన్లో ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్ని తానై జీవితాంతం తోడుగా నిలవాల్సిన ఓ భర్త.. తన భార్యను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టాడు. దాదాపు 120 మంది పురుషులతో ఆమెకు అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించిన వివరాలను ప్రాసిక్యూటర్ ఈడా అన్నర్‌స్టెడ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. 60 ఏళ్ల వయసున్న నిందితుడిని పోలీసులు గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. దాదాపు 50 ఏళ్ల వయసున్న అతడి భార్య స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు అతడు సొంత భార్యనే విటులకు సరఫరా చేసినట్లు అన్నర్‌స్టెడ్ పేర్కొన్నారు. కాగా నిందితుడు తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఖండించినప్పటికీ.. సుమారు రెండేళ్ల పాటు అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆ సమయంలో ఆమెకు ఏవైనా మత్తు మందులు ఇచ్చారా లేదా ఇతర ఒత్తిళ్లకు గురిచేశారా అనే విషయాలను మాత్రం ప్రాసిక్యూటర్ వెల్లడించలేదు. ఏదేమైనప్పటికి ఈ కేసు ప్రస్తుతం స్వీడన్లో సంచలనం సృష్టిస్తోంది. -
ప్యారిస్ దాడిలో కొత్తగా మరో ఇద్దరు
బ్రస్సెల్స్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో గతేడాది ఉగ్రదాడికి పాల్పడి 130మందిని హతమార్చిన ఘటనలో తాజాగా ఇద్దరు నిందితులపై బెల్జియం పోలీసులు అభియోగాలు నమోదుచేసి గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిని కే ఫరీద్, మర్యమ్ ఈబీగా గుర్తించిన అధికారులు.. వీరికి గతేడాది మార్చిలో బ్రసెల్స్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఖలీద్ ఎల్ బక్రోయ్తో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. సిరియా, లిబియాలో ఫ్రాన్స్ సైనిక జోక్యానికి ప్రతీకారంగా తామే ఈ దాడులు చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
రెండు వర్గాల మధ్య వర్గపోరు


