నిప్పులు చెరిగిన సిరాజ్‌.. లంచ్ బ్రేక్‌కు విండీస్ స్కోరంతంటే? | IND Vs WI 1st Test, Windies 90-5 At Lunch India Display Complete Domination, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

IND vs WI 1st Test: నిప్పులు చెరిగిన సిరాజ్‌.. లంచ్ బ్రేక్‌కు విండీస్ స్కోరంతంటే?

Oct 2 2025 11:50 AM | Updated on Oct 2 2025 1:50 PM

IND vs WI 1st Test: Windies 90-5 at Lunch India display complete domination

అహ్మదాబాద్ వేదిక‌గా భార‌త్‌-వెస్టిండీస్ మ‌ధ్య తొలి టెస్టు జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ త‌డ‌బ‌డుతోంది. తొలి రోజు లంచ్ స‌మ‌యానికి క‌రేబియ‌న్ జ‌ట్టు త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 90 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ఓపెన‌ర్లు తేజ్‌నార‌య‌ణ్ చంద‌ర్‌పాల్‌(0), జాన్ క్యాంప్‌బెల్‌(8) తీవ్ర నిరాశ‌ప‌రిచారు. ఆ త‌ర్వాత బ్రాండెన్ కింగ్‌(13), అలిక్ అథనాజ్(12) కాసేపు నిల‌క‌డ‌గా ఆడారు. కానీ వీరిద్ద‌రిని స్వ‌ల్ప వ్య‌వధిలో సిరాజ్ పెవిలియ‌న్‌కు పంపాడు. ఆ త‌ర్వాత కెప్టెన్ ఛేజ్‌(22), హోప్(26) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. 

అయితే లంచ్ బ్రేక్ ముందు హోప్ వికెట్‌ను విండీస్ కోల్పోయింది. కుల్దీప్ అద్బుత‌మైన బంతితో హోప్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్ నిప్పులు చెరిగాడు. 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జ‌స్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. 


తుది జట్లు
వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: టాగెనరైన్ చందర్‌పాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీప‌ర్‌), రోస్టన్ చేజ్ (కెప్టెన్‌), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, బి సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: IND vs WI: టీమిండియాతో మ్యాచ్‌.. చందర్‌పాల్ త‌న‌యుడు అట్టర్ ప్లాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement