టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా- సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మధ్య నెలకొన్న 'బౌనా'(మరగుజ్జు) వివాదం సద్దమణుగింది. ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్టు ముగిసిన అనతరం బుమ్రా.. బవుమా వద్దకు వెళ్లి అప్యాయంగా మాట్లాడు.
ఈ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఆ పదం వాడలేదని బవుమాకు బుమ్రా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దీంతో వెంటనే ప్రోటీస్ కెప్టెన్ కూడా బుమ్రాను అలింగనం చేసుకుంటా నవ్వుతూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అసలేమి జరిగిందంటే?
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బుమ్రా ఆఖరి బంతిని బవుమాకు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని బవుమా ఆడే ప్రయత్నం చేయగా బంతి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నో అంటూ తల ఊపాడు.
దీంతో ఆర్‌ఎస్ తీసుకోవాలా వద్దా అని బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో చర్చించాడు. బంతి ప్యాడ్స్‌కు ఎత్తుగా తగిలిందని పంత్ చెప్పినప్పుడు అందుకు బుమ్రా "బౌనా భీ హై" అని సమాధనమిచ్చాడు. 'బౌనా' అనేది హిందీలో మరగుజ్జు అని అర్థం.
బవుమా పొట్టిగా ఉండటం వల్ల బంతి స్టంప్స్‌ను మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి జస్ప్రీత్ ఈ పదం ఉపయోగించాడు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు.
ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్‌వెల్ ప్రిన్స్ సైతం స్పందించాడు. ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ ఇప్పటివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి చర్చా రాలేదు. ఇక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బుమ్రా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇక ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
చదవండి: WTC 2025-27 Points Table: టాప్-2కు సౌతాఫ్రికా.. మరి భారత్ ఏ ప్లేస్‌లో ఉందంటే?
Bumrah explaining the Bauna controversy to Bavuma crying 😭😭 pic.twitter.com/l9WTsYcCkZ
— tweeting from my grave. (@kalhonahoooooo) November 16, 2025


