సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనను అద్భుతమైన విజయంతో ఆరంభించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీ బౌలర్లు డిఫెండ్ చేసి అద్భుతం చేశారు.
లక్ష్య చేధనలో భారత్ కేవలం 93 పరుగులకే ఆలౌటైంది. ప్రోటీస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్ల పడగొట్టి టీమిండియాను దెబ్బ తీశాడు. అతడితో కేశవ్ మహారాజ్, జానెసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
తొలి జట్టుగా రికార్డు..
👉ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టెస్టుల్లో లోయోస్ట్ టోటల్ డిఫెండ్ చేసిన జట్టుగా ప్రోటీస్ నిలిచింది. ఇంతకుముందు రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. ఈ వేదికలో 1973లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 192 పరుగులను టీమిండియా కాపాడుకుంది. తాజా మ్యాచ్‌లో 124 పరుగులను డిఫెండ్ చేసుకున్న సౌతాఫ్రికా.. భారత్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.
👉అదేవిధంగా సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ కూడా ఓ రికార్డు సాధించాడు. భారత్‌పై ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన సఫారీ ప్పిన్నర్‌గా హార్మర్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అతడు 51 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాల్ ఆడమ్స్ పేరిట ఉండేది. 1996లో కాన్పూర్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడమ్స్ 139 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్


