దుమ్మురేపిన కిల్లర్‌ మిల్లర్‌.. బోణీ కొట్టిన రాయల్స్‌ | SA20 2025-26: Miller slams fifty, paarl royals enrolls first victory | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన కిల్లర్‌ మిల్లర్‌.. బోణీ కొట్టిన రాయల్స్‌

Dec 31 2025 8:12 PM | Updated on Dec 31 2025 8:12 PM

SA20 2025-26: Miller slams fifty, paarl royals enrolls first victory

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో పార్ల్‌ రాయల్స్‌ బోణీ కొట్టింది. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో ఇవాళ (డిసెంబర్‌ 31) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత రాయల్స్‌ బౌలర్లు చేలరేగిపోయారు. ఆతర్వాత కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (38 బంతుల్లో 71 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి రాయల్స్‌ను గెలిపించాడు. ప్రస్తుత ఎడిషన్‌లో రాయల్స్‌కు ఇది విజయం కాగా.. ఈస్ట్రన్‌కేప్‌కు తొలి పరాజయం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఈస్ట్రన్‌కేప్‌కు రాయల్స్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. మొకొయెనా (4-0-34-4), ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-36-3), ఫోర్టుయిన్‌ (4-0-16-0), ముజీబ్‌ రెహ్మాన్‌ (4-0-30-1), డెలానో పొట్గెటర్‌ (2-0-15-1) ధాటి​కి ఈస్ట్రన్‌కేప్‌ 149 పరుగులకే చాపచుట్టేసింది.

ఈస్ట్రన్‌కేప్‌ ఇన్నింగ్స్‌లో జోర్డన్‌ హెర్మన్‌ (47) టాప్‌ స్కోరర్‌గా నిలువగా..బెయిర్‌స్టో (33) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. మిగతా బ్యాటర్లలో కెప్టెన్‌ స్టబ్స్‌, మార్కో జన్సెన్‌ తలో 17, బ్రీట్జ్కీ 13, డికాక్‌ 7, గ్రెగరి 5, ముత్తుసామి 2, నోర్జే 4, రత్నాయకే 1 (నాటౌట్‌) పరుగులు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్‌ కూడా తడబడింది. మిల్నే (4-0-22-0), జన్సెన్‌ (4-0-25-2), నోర్జే (4-0-21-2) పొదుపుగా బౌలింగ్‌ చేశారు. అయితే డేవిడ్‌ మిల్లర్‌.. కీగన్‌ లయన్‌ (45) సాయంతో రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రాయల్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో ప్రిటోరియస్‌ (11), ట్రైబ్‌ (7), హెర్మన్‌ (9), వెర్రిన్‌ (3) విఫలమయ్యారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement