చరిత్ర సృష్టించిన క్రిస్‌ లిన్‌ | CHRIS LYNN BECOMES THE FIRST PLAYER TO COMPLETE 4000 RUNS IN BBL HISTORY | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన క్రిస్‌ లిన్‌

Dec 31 2025 6:57 PM | Updated on Dec 31 2025 7:14 PM

CHRIS LYNN BECOMES THE FIRST PLAYER TO COMPLETE 4000 RUNS IN BBL HISTORY

ఆస్ట్రేలియా వెటరన్‌ బ్యాటర్‌ క్రిస్‌ లిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2025-26 ఎడిషన్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (డిసెంబర్‌ 31) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు (అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ఆడుతూ).

ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 79 పరుగులు చేసిన లిన్‌.. చారిత్రక మైలురాయిని తాకడంతో పాటు తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌ కెరీర్‌లో 129 ఇన్నింగ్స్‌లు ఆడిన లిన్‌ 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 32 అర్ద సెంచరీలు, సెంచరీ సాయంతో 4065 పరుగులు చేశాడు.

మొత్తం టీ20 కెరీర్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన లిన్‌.. 57 అర్ద శతకాలు, 6 శతకాల సాయంతో 8636 పరుగులు చేశాడు. పవర్‌ హిట్టర్‌గా పేరున్న లిన్‌ ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపించాడు. 2012-21 మధ్యలో 42 మ్యాచ్‌లు ఆడి 140.6 స్ట్రయిక్‌రేట్‌తో 10 అర్ద సెంచరీల సాయంతో 1329 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. లిన్‌ చెలరేగడంతో బ్రిస్బేన్‌ హీట్‌పై అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ​ చేసిన హీట్‌.. జేమీ ఓవర్టన్‌ (4-0-19-3), లియామ్‌ స్కాట్‌ (4-0-12-2), హసన్‌ అలీ (4-0-29-2), లూక్‌ వుడ్‌ (4-0-19-1), మాథ్యూ షార్ట్‌ (0.4-0-1-1) దెబ్బకు 19.4 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. 

హీట్‌ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్‌ ఆటగాడు కుహ్నేమన్‌ (31 నాటౌట​) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అడిలైడ్‌ 14.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్రిస్‌ లిన్‌ (79 నాటౌట్‌) మెరుపు అర్ద శతకంతో అడిలైడ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement