ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భారత యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ అదరగొడుతున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు.
ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన వైభవ్, క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడితో పాటు నమన్ ధీర్(20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించాడు. వీరిద్దరి మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.
10 ఓవర్లలో భారత్ స్కోర్ 93-3 ఉండగా 43 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో షాహిద్ అజీజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాజ్ సదఖత్, షాహిద్ అజీజ్ తలా రెండు వికెట్లు సాధించారు.


