టీమిండియాతో మ్యాచ్‌.. చందర్‌పాల్ త‌న‌యుడు అట్టర్ ప్లాప్‌ | Tagenarine Chanderpaul Departs For An 11-ball Duck Against India, More Details Inside | Sakshi
Sakshi News home page

IND vs WI: టీమిండియాతో మ్యాచ్‌.. చందర్‌పాల్ త‌న‌యుడు అట్టర్ ప్లాప్‌

Oct 2 2025 10:50 AM | Updated on Oct 2 2025 12:56 PM

Tagenarine Chanderpaul departs for an 11-ball duck against india

వెస్టిండీస్ దిగ్గ‌జం శివనారాయణ్ చందర్‌పాల్ త‌న‌యుడు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ త‌న పున‌రాగ‌మ‌నంలో తీవ్ర నిరాశ‌పరిచాడు. దాద‌పు 20 నెల‌ల త‌ర్వాత విండీస్ జ‌ట్టులోకి వ‌చ్చిన చంద‌ర్‌పాల్ త‌న రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు.

అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో తేజ్‌నారాయణ్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. విండీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భార‌త పేస‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌ల‌ను ఎదుర్కొవడానికి చంద‌ర్‌పాల్ తీవ్ర ఇబ్బంది ప‌డ్డాడు.

ఈ క్ర‌మంలో 11 బంతులు ఎదుర్కొన్న చంద‌ర్‌పాల్ సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో త‌న రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్స్ చేరాల్సింది. చంద‌ర్‌పాల్ 2022లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు.

ఆ త‌ర్వాత జింబాబ్వేపై అద్బుత‌మైన డ‌బుల్ సెంచ‌రీ సాధించి అంద‌రి దృష్టిని ఈ జూనియర్ చందర్ పాల్ ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత తన ఫామ్‌ను అతడు కోల్పోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టాడు. అతడు ఈ మ్యాచ్ కంటే ముందు చివరగా ఆస్ట్రేలియాపై గతేడాది జనవరిలో విండీస్ తరపున ఆడాడు.

అయితే దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు అతడికి తిరిగి పిలుపునిచ్చారు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చందర్‌పాల్ ఇప్పటివరకు పది టెస్టు మ్యాచ్‌లు ఆడి 32.94 సగటుతో 560 పరుగులు చేశాడు. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తడబడుతోంది. విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్లను దెబ్బ తీయగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు.
చదవండి: IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement