breaking news
Sivanarayan Chanderpaul
-
టీమిండియాతో మ్యాచ్.. చందర్‌పాల్ తనయుడు అట్టర్ ప్లాప్
వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణ్ చందర్‌పాల్ తనయుడు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. దాదపు 20 నెలల తర్వాత విండీస్ జట్టులోకి వచ్చిన చందర్‌పాల్ తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో తేజ్‌నారాయణ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. విండీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌లను ఎదుర్కొవడానికి చందర్‌పాల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ క్రమంలో 11 బంతులు ఎదుర్కొన్న చందర్‌పాల్ సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్స్ చేరాల్సింది. చందర్‌పాల్ 2022లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత జింబాబ్వేపై అద్బుతమైన డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఈ జూనియర్ చందర్ పాల్ ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత తన ఫామ్‌ను అతడు కోల్పోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టాడు. అతడు ఈ మ్యాచ్ కంటే ముందు చివరగా ఆస్ట్రేలియాపై గతేడాది జనవరిలో విండీస్ తరపున ఆడాడు.అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు అతడికి తిరిగి పిలుపునిచ్చారు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చందర్‌పాల్ ఇప్పటివరకు పది టెస్టు మ్యాచ్‌లు ఆడి 32.94 సగటుతో 560 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తడబడుతోంది. విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్లను దెబ్బ తీయగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు.చదవండి: IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్ -
చందర్‌పాల్‌కు మొండి చెయ్యి
రొసేయు (డోమినికా) : స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన వెటరన్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చందర్‌పాల్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్‌మన్‌కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో బ్రియాన్ లారా (11,953 పరుగులు) తర్వాత చందర్‌పాల్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో 87 పరుగులు చేస్తే చందర్‌పాల్ టాప్ స్కోరర్ ఘనతను సాధిస్తాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చందర్‌పాల్ సగటు 15.33 మాత్రమే ఉండటంతో సెలక్టర్లు అతని ఎంపికపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఆసీస్‌తో ఒక్క సిరీస్‌కు అవకాశం ఇస్తే బాగుండేదని చందర్‌పాల్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. 1994లో జాతీయ జట్టులోకి వచ్చిన చందర్‌పాల్ ఇప్పటివరకు 164 టెస్టులు ఆడి 51.37 సగటుతో 11,867 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సెలక్టర్ల తాజా నిర్ణయంతో చందర్‌పాల్ టెస్టు కెరీర్ ముగిసినట్టేనని భావించాలి.