రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్ తలపడనుంది.
ఈ సమయంలో జాతీయ విధులు లేకపోవడంతో సిరాజ్ రంజీల్లో ఆడనున్నాడు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతడికి జట్టు పగ్గాలను అప్పగించారు. సిరాజ్ డిప్యూటీగా రాహుల్ సింగ్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు వంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కింది. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్‌రావ్ పేరాల కూడా ఉన్నాడు.
హైదరాబాద్ జట్టు
మహ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు,కె హిమతేజ, వరుణ్ గౌడ్,ఎం అభిరత్ రెడ్డి, రాహుల్ రాధేష్, అమన్ రావ్, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్, నితీశ్ రెడ్డి, సాయి ప్రగ్నయ్ రెడ్డి,బి పున్నయ్య
చదవండి: IND vs NZ: వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో


