టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి బంతితో అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వేను సంచలన బంతితో రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.
కానీ భారత పేసర్లు రాణా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రాణా వేసిన అద్భుతమైన డెలివరీకి కాన్వే దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ ఢిల్లీ పేసర్ కాన్వేకు గుడ్ లెంగ్త్ బాల్‌గా సంధించాడు.
బంతి ఆఫ్ స్టంప్ దగ్గర పిచ్ అయ్యి లోపలికి దూసుకొచ్చింది. కాన్వే ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. వెంటనే హర్షిత్ రాణా తనదైన శైలిలో దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వైపు వేలు చూపిస్తూ చెప్పా కాదా అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు తొలి వన్డేలో రాణా రెండు వికెట్లతో పాటు 29 పరుగులు చేశాడు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తన ప్రదర్శనలతో రాణా సమాధనమిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(112) అజేయ సెంచరీతో మెరిశాడు.
చదవండి: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్
Off stump out of the ground 🔥🔥
Harshit Rana gets the opening wicket in fine fashion! ⚡️
Updates ▶️ https://t.co/x1fEenI0xl#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/mYvTSD273W— BCCI (@BCCI) January 14, 2026


