
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో ఓలీ పోప్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ 41 టెస్ట్ మ్యాచ్‌ల్లో 117 వికెట్లు.. 44 వన్డేల్లో 71 వికెట్లు.. 16 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఓలీ పోప్ వికెట్ తర్వాత మరో రెండు వికెట్లు కూడా తీశాడు. జో రూట్, బేకబ్ బేతెల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఇప్పటివరకు 3 వికెట్లు తీశాడు. సిరాజ్ తీసిన 3 వికెట్లు ఎల్బీడబ్ల్యూలే కావడం విశేషం.
సిరాజ్ చెలరేగడంతో టీమిండియా మ్యాచ్‌పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. సిరాజ్‌తో పాటు ఆకాశ్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణ (తలో వికెట్) కూడా తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 195 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43), ఓలీ పోప్ (22), జో రూట్ (29), జేకబ్ బేతెల్ (6) ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (22), జేమీ స్మిత్ (5) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే.