
వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సంచలన క్యాచ్‌తో మెరిశాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి రెండు చేతులతో బంతిని ఒడిసిపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్ (IND vs WI)తో సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇన్నింగ్స్ డిక్లేర్
ఇందుకు బదులుగా టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 286 పరుగుల ఆధిక్యంలో ఉన్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విండీస్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. భారత సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.
సిరాజ్ బౌలింగ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. బంతిని గాల్లోకి లేపాడు. ఇంతలో.. స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ కుమార్ రెడ్డి గాల్లోకి ఎగిరి.. డైవ్ చేసి మరీ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది.
49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి..
ఇక ఈసారి కూడా భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. శనివారం నాటి మూడో రోజు ఆటలో 23 ఓవర్లు ముగిసేసరికి 49 పరుగులు మాత్రమే చేసిన విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా..
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛. 👏
Nitish Kumar Reddy grabs a flying stunner 🚀
Mohd. Siraj strikes early for #TeamIndia ☝️
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/1Bph4oG9en— BCCI (@BCCI) October 4, 2025