
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 26.91 సగటున 37 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండేవాడు. తాజాగా జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzarabani) సిరాజ్ను వెనక్కు నెట్టి, అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.
ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన ముజరబానీ తన వికెట్ల సంఖ్యను 39కి (10 మ్యాచ్ల్లో) పెంచుకున్నాడు. ముజరబానీ, సిరాజ్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ (7 మ్యాచ్ల్లో 29 వికెట్లు), నౌమన్ అలీ (26), నాథన్ లియోన్ (24) ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ముజరబానీతో పాటు (11-1-47-3), బ్రాడ్ ఈవాన్స్ (9.3-2-22-5), తనక చివంగ (6-0-29-1) చెలరేగడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ను తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6) ఔట్ కాగా.. బెన్ కర్రన్ (34), నిక్ వెల్చ్ (40) క్రీజ్లో ఉన్నారు.
కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.
చదవండి: PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్