పియాస్ట్రి రేసులో ఉంటాడు
మెక్‌లారెన్ డ్రైవర్ నోరిస్ వ్యాఖ్య
అబుదాబి: ఈ సీజన్ ఫార్ములావన్ చాంపియన్‌షిప్ కోసం జట్టు సహచరుడు పియా్రస్టితో ఎలాంటి మంతనాలు ఉండవని లాండో నోరిస్ వ్యాఖ్యానించాడు. మెక్‌లారెన్ డ్రైవర్లలో నోరిస్ 408 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్కార్ పియాస్ట్రి 392 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. గత ఆదివారం ఖతర్ గ్రాండ్‌ప్రి గెలుపొందడంతో రెడ్‌బుల్ రేసర్ వెర్‌స్టాపెన్ (396) రెండో స్థానంలోకి దూసుకురావడంతోనే ఈ సీజన్ ‘ఫార్ములా’ ఆఖరి మజిలీకి చేరింది.
ఈ ఆదివారం జరిగే అబుదాబి గ్రాండ్‌ప్రిపై రేసింగ్ ప్రియుల ఆసక్తిని పెంచింది. ఈ రేసుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పియాస్ట్రి, వెర్‌స్టాపెన్‌లతో కలిసి నోరిస్ పాల్గొన్నాడు. ‘నిజాయితీగా చెబుతున్నా... గెలవాలని నాకున్నా గెలిపించేందుకు సహకరించమని అడగను. దీనికి ఆస్కార్ ఒప్పుకుంటాడో లేదో తెలీదు. తప్పనిసరి అని నేను భావించను’ అని నోరిస్ స్పష్టం చేశాడు.
ఇద్దరు మెక్‌లారెన్ డ్రైవర్ల (పియాస్ట్రి, నోరిస్)లో నోరిస్‌కే టైటిల్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంతలా అంటే అబుదాబిలో వెర్‌స్టాపెన్ గెలిచినా కూడా నోరిస్ టాప్–3లో ఉంటే చాలు మెక్‌లారెన్ జట్టు 17 ఏళ్ల తర్వాత ఫార్ములావన్ విజేతగా నిలుస్తుంది. 2008లో హామిల్టన్ తర్వాత మరే మెక్‌లారెన్ డ్రైవర్ విజేతగా నిలువలేకపోయాడు. మరోవైపు వెర్‌స్టాపెన్ మాట్లాడుతూ ఆఖరి రేసులో ఏమైనా జరగొచ్చని, రేసు ఆషామాïÙగా ఉండబోదని చెప్పాడు.


