మెక్సికో సిటీ: గత ఐదు రేసుల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన మెక్‌లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ మళ్లీ గెలుపు బాటలో పడ్డాడు. ఐదు రేసుల తర్వాత ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో ఆరో విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో బ్రిటన్‌కు చెందిన లాండో నోరిస్ విజేతగా నిలిచాడు.
‘పోల్ పొజిషన్’తో ఈ రేసును ఆరంభించిన నోరిస్ నిరీ్ణత 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా ఒక గంట 37 నిమిషాల 58.574 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని అలంకరించాడు. ఈ సీజన్‌లో ఏడు విజయాలతో నిలకడగా రాణిస్తున్న మెక్‌లారెన్‌కే చెందిన మరో డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి మెక్సికో గ్రాండ్‌ప్రిలో తడబడ్డాడు. చివరకు ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫలితంగా 19 రేసులు ముగిశాక 346 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్న పియాస్ట్రిమెక్సికో రేసు తర్వాత రెండో స్థానానికి పడిపోయాడు. మెక్సికో ట్రాక్‌పై రయ్‌మంటూ దూసుకుపోయిన నోరిస్ 25 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 357 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్íÙప్ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
356 పాయింట్లతో పియాస్ట్రి రెండో స్థానంలో, 321 పాయింట్లతో వెర్‌స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. ఏప్రిల్‌లో ఐదో రేసు ముగిశాక నోరిస్ చివరిసారి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ఆ తర్వాత పియాస్ట్రి మొదటి స్థానంలోకి వచ్చాడు. ఈ సీజన్‌లోని తొలి రేసు ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గి శుభారంభం చేసిన నోరిస్ ఆ తర్వాత మొనాకో, ఆ్రస్టియా, బ్రిటిష్ హంగేరి గ్రాండ్‌ప్రిలలో విజయం సాధించాడు. 24 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటికి 20 రేసులు ముగిశాయి. తదుపరి రేసు సావోపాలోలో బ్రెజిలియన్ గ్రాండ్‌ప్రి నవంబర్ 9న జరుగుతుంది. గత రెండేళ్లుగా బ్రెజిలియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలుస్తున్న వెర్‌స్టాపెన్ మెక్‌లారెన్ డ్రైవర్లను నిలువరిస్తూ ‘హ్యాట్రిక్’ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.


