మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ తన 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు. తన కెరీర్‌లో మొట్టమొదటి ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆదివారం యాస్ మెరీనా సర్క్యూట్‌లో జరిగిన సీజన్-ముగింపు అబుదాబి గ్రాండ్ ప్రి (Abu Dhabi GP)లో మూడో స్ధానంలో నోరిస్ నిలిచాడు.
The moment of glory 🏆#F1 #AbuDhabiGP pic.twitter.com/GJZJQ1oKnZ
— Formula 1 (@F1) December 7, 2025
అయితే డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నోరిస్ (423 పాయింట్లు) అగ్రస్ధానంలో నిలిచి తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) కేవలం రెండు పాయింట్ల తేడాతో టైటిల్‌ను కోల్పోయాడు.
LANDO NORRIS IS THE 2025 FORMULA 1 WORLD CHAMPION!!!! 🏆#F1 #AbuDhabiGP pic.twitter.com/Rg4cc4OwlU
— Formula 1 (@F1) December 7, 2025
దుబాయ్‌లో జరిగిన చివరి రేసును వెర్‌స్టాపెన్ గెలుచుకున్నప్పటికి.. ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో(421 పాయింట్లు) రెండవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా 2008లో లూయిస్ హామిల్టన్ (Lewis Hamilton) గెలిచిన తర్వాత మెక్‌లారెన్‌కు డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్ దక్కడం ఇదే మొదటిసారి.


