బిజినెస్ రంగంలోకి సిరాజ్‌.. బంజారా హిల్స్‌లో లగ్జరీ రెస్టారెంట్‌ | Mohammed Siraj Steps Into Food Business With New Restaurant In Hyderabad | Sakshi
Sakshi News home page

Mohammed Siraj: బిజినెస్ రంగంలోకి సిరాజ్‌.. బంజారా హిల్స్‌లో లగ్జరీ రెస్టారెంట్‌

Jun 19 2025 8:24 PM | Updated on Jun 19 2025 9:07 PM

Mohammed Siraj Steps Into Food Business With New Restaurant In Hyderabad

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్(రోడ్ నంబ‌ర్ 3)లో 'జోహార్ఫా'  పేరిట సరికొత్త లగ్జరీ రెస్టారెంట్‌ను సిరాజ్ ప్రారంభించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కస్టమర్ల కోసం పర్షియన్‌, అరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్​లో అందించనున్నట్లు తెలిపాడు.

ఈ ఫుడ్ బిజినెస్‌లో అతడి సోదరుడు భాగస్వామి ఉన్నట్లు సిరాజ్ మియా పేర్కొన్నాడు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభ  తేదీ ఎప్పుడో ఇంకా సిరాజ్ వెల్లడించలేదు. కాగా భారత క్రికెటర్లు ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి  వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. 

బెంగళూరు, ముంబై, పుణే, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్‌లో వన్ 8 కమ్యూన్  రెస్టారెంట్లు ఉన్నాయి. కోహ్లితో పాటు  రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫుడ్‌బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఇక సిరాజ్‌ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి భారత బౌలింగ్‌ విభాగాన్ని సిరాజ్‌ లీడ్‌ చేయనున్నాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జూన్‌ 20 నుంచి 24 వరకు జరగనుంది.
చదవండి: నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనుకుంటున్నా: గిల్‌

Advertisement
 
Advertisement
Advertisement