నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనుకుంటున్నా: గిల్‌ | Shubman Gill Promises Big On The Eve Of 1st India-England Test | Sakshi
Sakshi News home page

నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనుకుంటున్నా: గిల్‌

Jun 19 2025 7:39 PM | Updated on Jun 19 2025 7:57 PM

Shubman Gill Promises Big On The Eve Of 1st India-England Test

లీడ్స్‌లోని హెడింగ్లీ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు శుక్ర‌వారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్ద‌మైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభ‌రంభం చేయాల‌ని భార‌త జ‌ట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ విలేక‌రుల స‌మావేశంలో పాల్గోనున్నాడు.

ఈ సంద‌ర్భంగా పలు ప్ర‌శ్న‌ల‌కు గిల్ స‌మాధ‌న‌మిచ్చాడు. భార‌త కెప్టెన్‌గా త‌ను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం త‌న బ్యాటింగ్‌పై ప‌డ‌కుండా చూసుకుంటాని అత‌డు చెప్పుకొచ్చాడు. "ఇప్ప‌టివ‌ర‌కు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చ‌తో బ్యాటింగ్ చేశానో, ఇక‌పై కూడా అదే కొన‌సాగిస్తున్నాను. 

కెప్టెన్సీ గురుంచి ఎక్కువ‌గా ఆలోచించ‌కుండా నా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటి​కే గంభీర్ భాయ్‌, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్‌ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.

భ‌య‌పెడుతున్న గిల్ రికార్డు..
శుబ్‌మ‌న్ గిల్ త‌న కెరీర్‌లో 32 టెస్టులు ఆడి 1893 ప‌రుగులు చేశాడు. అందులో ఆరు సెంచ‌రీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్ప‌టివ‌ర‌కు 11 టెస్టులు ఆడి 514 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇంగ్లండ్‌లో అయితే అత‌డి ప్ర‌ద‌ర్శ‌న మ‌రి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై మూడు టెస్టులు ఆడిన శుబ్‌మ‌న్‌..  14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement