సాక్షి, విజయవాడ: అంబేద్కర్ గురుకుల పార్ట్ టైం టీచర్ల ధర్నా ఐదో రోజు కొనసాగుతోంది. గాంధీ జయంతి రోజున గాంధేయ మార్గంలో నిరసన చేపట్టారు. తమను పార్ట్ టైం నుంచి కాంట్రాక్ట్‌కి మార్చాలని డిమాండ్ చేశారు. ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై పార్ట్‌టైం టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఉపాధ్యాయులు ప్రకటించారు. టీచర్లకు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు పెరుగుతోంది.
కాగా, రెండు రోజుల క్రితం దీక్ష శిబిరాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో పనిచేసే పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్ల శ్రమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. పార్ట్‌టైం ఉపాధ్యాయులు, అధ్యాపకుల డిమాండ్లు న్యాయమైన... పార్ట్‌టైం ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, నెల నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తెలిసే వంచన!


