అతివలదే ఆధిపత్యం! | - | Sakshi
Sakshi News home page

అతివలదే ఆధిపత్యం!

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,57,555 ఉండగా అందులో 127,231 మంది పురుష ఓటర్లు, 130,294 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్‌సీ ఓటర్లు 33,137 మంది. ఎస్‌టీ ఓటర్లు 3,229 మంది, బీసీ ఓటర్లు 128,654 మంది ఉండగా ఓసీలు 92,535 మంది ఓటర్లు ఉన్నారు. పునర్విభజన తర్వాత 28 డివిజన్లు ఉండగా పది వేలకు పైగా ఓట్లు ఉన్న డివిజన్లు రెండు, తొమ్మిది వేల నుంచి పది వేల లోపు ఉన్న డివిజన్లు 13, ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల లోపు ఉన్న డివిజన్లు 13 ఉన్నాయి. మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లు ఉన్న డివిజన్లు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. ● విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,79,011 ఉండగా అందులో 135,389 మంది పురుష ఓటర్లు, 143,574 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్‌సీ ఓటర్లు 28,414 మంది. ఎస్‌టీ ఓటర్లు 3,705 మంది, బీసీ ఓటర్లు 130,234 మంది ఉండగా ఓసీలు 111,451 మంది ఓటర్లు ఉన్నారు. పునర్విభజన తర్వాత 29 డివిజన్లు ఉండగా పది వేలకు పైగా ఓట్లు ఉన్న డివిజన్లు తొమ్మిది, తొమ్మిది వేల నుంచి పది వేల లోపు ఉన్న డివిజన్లు 15, ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల లోపు ఉన్న డివిజన్లు ఐదు ఉన్నాయి. మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లు ఉన్న డివిజన్లు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి.

విజయవాడ ఓటర్లలో మహిళల సంఖ్యే అధికం కేవలం పది డివిజన్లలోనే పురుషాధిక్యత 76 డివిజన్లలో వనితలదే పై చేయి ఓటర్లలో గణనీయంగా బీసీలు.. డివిజన్ల వారీ ఓటర్ల వివరాలు విడుదల చేసిన కార్పొరేషన్‌

నగర రాజకీయాల్లో..

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఓటర్లలో మహిళల సంఖ్యే ఎక్కువ.. పురుషుల కన్నా 15,995 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు కార్పొరేషన్‌ ప్రకటించింది. గురువారం నియోజకవర్గాల వారీగా ఎస్‌టీ, ఎస్‌సీ, బీసీ, ఓసీ ఓటర్ల వివరాలను విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రకటించారు. దీన్ని బటి చూస్తే కేవలం పది డివిజన్లలోనే పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగిలిన 76 డివిజన్లలో మహిళా ఓటర్ల సంఖ్యే గణనీయంగా ఉండటం విశేషం. మరోవైపు బీసీ ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. విజయవాడ తూర్పు మినహాయిస్తే సెంట్రల్‌, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలలో బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. మొత్తం ఓటర్లు 8,05,797 కాగా పురుష ఓటర్లు 3,94,792 మంది, మహిళా ఓటర్లు 4,10,787 మంది ఉండగా ఇతరులు 82 మంది ఉన్నారు. విజయవాడ తూర్పులో ఓసీల సంఖ్య ఎక్కువగా ఉండగా, పశ్చిమ, సెంట్రల్‌లో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది. నగరంలో ఎస్‌సీ ఓటర్లు 91,932 మంది, ఎస్‌టీ ఓటర్లు 9,542, బీసీ ఓటర్లు 3,58,742, ఓసీ ఓటర్లు 3,45,581 మంది ఉన్నారు.

తూర్పు నియోజకవర్గంలో..

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,69,231 ఉండగా అందులో 132,172 మంది పురుష ఓటర్లు, 137,019 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్‌సీ ఓటర్లు 30,382 మంది. ఎస్‌టీ ఓటర్లు 2,608 మంది, బీసీ ఓటర్లు 99,864 మంది ఉండగా ఓసీలు 1,36,388 మంది ఓటర్లు ఉన్నారు. పునర్విభజన తర్వాత 29 డివిజన్లు ఉండగా పది వేలకు పైగా ఓట్లు ఉన్న డివిజన్లు మూడు, తొమ్మిది వేల నుంచి పది వేల లోపు ఉన్న డివిజన్లు 17, ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల లోపు ఉన్న డివిజన్లు తొమ్మిది ఉన్నాయి. మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లు ఉన్న డివిజన్లు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement