కపటధారి! | - | Sakshi
Sakshi News home page

కపటధారి!

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

కపటధారి! బెడిసికొట్టిన కూటమి ఎన్నికల స్టంట్‌

బీసీలకు మరోమారు చంద్రబాబు వెన్నుపోటు బీసీ రిజర్వేషన్లపై సర్కారుకు హైకోర్టు షాక్‌ చట్ట సవరణ అంశాలను జీవోలతో కప్పిపుచ్చిన ప్రభుత్వం సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు

చిత్తశుద్ధి అంటే వైఎస్సార్‌ సీపీదే..

పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర జనాభాలో అధికంగా ఉండే వెనుకబడిన తరగతులు(బీసీ)పై ప్రభుత్వం మరోమారు తమ కపట వైఖరిని ప్రదర్శించింది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వారికి గుర్తుకువచ్చే బీసీ రిజర్వేషన్‌ పెంపుదల అంశంలో చిత్తశుద్ధి బహిర్గతమైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను పెంచి సీట్లు కేటాయిస్తామని గత ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా రెండు జీవోలను కూడా తీసుకువచ్చారు. అయితే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దీనిపై గురువారం కీలకతీర్పు వెల్లడించింది. బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34శాతం, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు 33.33శాతం రిజర్వేషన్‌లను కల్పిస్తామని తీసుకువచ్చిన జీవోలను కొట్టివేసింది.

సమాచారం సేకరించటంలో విఫలం..

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ పెంపుదల, ఖరారుకు సీనియర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌రంజన్‌ ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీసీల వెనుకబాటు తనంపై అనుభవపూర్వక విచారణ, వారి రిజర్వేషన్‌ పెంచే ప్రక్రియ చేయటమే ఈ కమిషన్‌ ఉద్దేశం. ఇది సెప్టెంబర్‌ 30 వరకు పనిచేసింది. అయితే కమిషన్‌ పూర్తిస్థాయిలో నివేదికలు ఇవ్వలేదని, సరైన సమాచారం సేకరించటంలో విఫలమైందని, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ప్రభుత్వం సమర్పించిన నివేదికలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆ నివేదిక కూడా తప్పుల తడకగా ఉందని, ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా నివేదిక హడావుడిగా ప్రభుత్వానికి సమర్పించారని ఆరోపిస్తున్నారు.

సుప్రీంకోర్టులో సాధించగలరా?

బీసీ రిజర్వేషన్‌ పెంపుదల అంశంపై హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని సమాచారం. అయితే కేంద్రంలో కూడా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక రిజర్వేషన్‌ 50 శాతానికి మించి పెంచే అవకాశంపై చట్ట సవరణ చేయాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకు వచ్చి బీసీల కోసం చట్ట సవరణ చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

నగరంలో బీసీల ప్రాతినిధ్యం..

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 86 డివిజన్లలో మూడు సర్కిళ్ల పరిధిలో మొత్తం 3,48,742 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. నగర ఓటర్లలో జనరల్‌ కేటగిరీ కంటే కూడా బీసీ ఓటర్లే అఽధికంగా ఉండటంతో చాలామంది కార్పొరేటర్‌ సీటు ఆశించే ఆశావహుల ఆశలపై చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం స్వలాభాన్ని కాంక్షించింది. దీంతో మరోమారు బీసీలకు అన్యాయం జరిగింది. నగరంలో 33.33 శాతంలో బీసీలకు సుమారు 29 డివిజన్‌లను బీసీలకు కేటాయించాల్సి ఉంది.

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఓసీ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పదవిని ఉప్పాల హారికకు ఇచ్చి బీసీలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. 2021లో వీఎంసీకి జరిగిన ఎన్నికల్లో మేయర్‌ పదవి జనరల్‌ మహిళా కేటగిరీకి కేటాయించారు. వైఎస్సార్‌ సీపీ మేయర్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన రాయన భాగ్య లక్ష్మిని నియమించారు. ఇంకా కార్పొరేటర్ల కేటాయింపులో కూడా జనాభా దామాషా ప్రకారం 64 డివిజన్లకు 23 మంది బీసీలకు సీట్లు కేటాయించింది. కోఆప్షన్‌ సభ్యురాలిగా జమలపూర్ణమ్మకు పదవిని ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement