విశాఖ : నగరంలోని రుషికొండ బీచ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రుషికొండ బీచ్‌ను ఆనుకుని ఉన్న రిషికొండ హిల్స్ ప్రాంతంలో ముగ్గురు బాలురు గల్లంతైన ఘటన శుక్రవారం సంభవించింది. స్నానానికి దిగిని ముగ్గురు యువకులు సముద్ర అలల ఉధృతికి గల్లంతయ్యారు. బాలురు ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
వీరు విశాఖ నగరంలోని మధురవాడ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. పది మంది కలిసి బీచ్‌కు రాగా, ముగ్గురు అలల ఉధృతికి గల్లంతయ్యారు. గల్లంతయిన వారు సూర్య ప్రకాష్, నితీష్, ప్రశాంత్‌లుగా గుర్తించారు. వీరంతా 9వ తరగతి చదువుతున్నారు. పిల్లలు సముద్రంలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు నెలలో రుషికొండ బీచ్‌లో అతి పెద్ద ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. చత్తీస్‌గడ్‌కు చెందిన ఏడుగురు పర్యాటకులు అలల ఉధృతికి కొట్టుకుని పోతుందగా వారిని లైఫ్ గార్డ్స్ సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి రక్షించారు. దాంతో ఆ ఏడురుగు పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి: అన్నా.. ఆకలేస్తుంది.. ఇంటికి తీసుకెళ్లండి!


