- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలు దేశానికి గర్వకారణం
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
హైదరాబాద్: ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందించారు.
శుక్రవారం లోక్‌భవన్‌లో మాట్లాడుతూ..
విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న క్షణాల్లోనూ కెప్టెన్ అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించారని గవర్నర్ పేర్కొన్నారు. కేవలం 30 సెకన్లు ఆలస్యమైనా పరిస్థితి మరింత విషమంగా మారేదన్నారు. అసాధ్యమనుకున్న పరిస్థితిని తన ధైర్యంతో సాధ్యంగా మార్చి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన తెగువ, మానవతా దృక్పథం భారతదేశానికి గర్వకారణమని గవర్నర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులను అభినందిస్తూ.. కెప్టెన్ సంపూర్ణ ఆరోగ్యంతో మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: ఆ చిన్నారి లేకపోతే ఎంత ఘోరం జరిగేదో?


