breaking news
tamil nadi
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
-
నేనూ మీలో ఒకడినే!
సాక్షి, చెన్నై: తాను తమిళనాడులో పుట్టలేదని, అయితే నేనూ తమిళుడ్నే, మీలో ఒకడినే అంటూ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రజల్ని ఆకర్షించే ప్రసంగంతో ఆదివారం ఈరోడ్, తిరుప్పూర్‌లలో దూసుకెళ్లారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడుకు వచ్చిన రాహుల్‌గాంధీ శనివారం కోయంబత్తూరులో పర్యటించారు. రెండవ రోజు ఈరోడ్, తిరుప్పూర్‌లలో ఆయన పర్యటన సాగింది. చేనేత కార్మికులు, రైతులు, మహిళా సంఘాలు, వర్తకులతో సమావేశాలు, రోడ్ షోలు, కాసేపు వాకింగ్‌తో ప్రజలకు పలకరింపు, సాయంత్రం బహిరంగసభ అంటూ రాహుల్ పరుగులు తీశారు. ప్యాంట్, టీషర్టుతో ఉరకలు పరుగులతో ముందుకు సాగారు. అలాగే తిరుప్పూరులో మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన దగ్గరికి వచ్చిన వారితో సెల్ఫీలు దిగారు. మోదీ గుప్పెట్లో.. ఈరోడ్ – తిరుప్పూర్ సరిహద్దులోని ఊత్తుకులిలో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. తమిళనాడుపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ధ్వజమెత్తారు. తమిళనాడు, ఇక్కడి సంస్కృతి అన్నా తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తమిళనాడులో అన్ని రకాల వనరులు ఉన్నా, అభివృద్ధి పథంగా ఎదగనివ్వకుండా కేంద్రంలోని మోదీ సర్కారు అడ్డుకుంటోందని ఆరోపించారు. మోదీ గుప్పెట్లో కీలుబొమ్మగా అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందని, అందుకే కేంద్రం ఆడించినట్టుగా ఇక్కడ ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళంలో మాట్లాడేసి తమిళుల్ని మోసం చేసేద్దామనుకున్నట్టున్నారని, ఆ పాచికలు ఇక్కడ పారబోదన్నది గుర్తుంచుకోండి అంటూ పరోక్షంగా మోదీకి హితవు పలికారు. పలు చోట్ల రాహుల్‌గాంధీ తన భద్రతా ఆంక్షలను లెక్కచేయకుండా వాహనం నుంచి దిగి నడుచుకుంటూ రోడ్డుపై ఉన్న ప్రజల్ని పలకరిస్తూ, కరచాలనం చేస్తూ ఆకర్షించే యత్నం చేశారు. ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ ఒంటరిగానే పరుగులు తీశారు. రాహుల్ పర్యటనలో ఎక్కడ డీఎంకే వర్గాలు కలవకపోవడం గమనార్హం. -
కరోనాతో సినీ నిర్మాత మృతి
సాక్షి, చెన్నై : కరోనా మహమ్మారి సినిమా నిర్మాతను బలి తీసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి లక్ష్మీ మూవీ మేకర్స్. కె మురళీధరన్, స్వామినాథన్, వేణుగోపాల్ మొదలగు ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా అరణ్ మనై కావలన్ అనే చిత్రాన్ని తొలిసారిగా 1994లో నిర్మించారు. ఆ తర్వాత గోకులంలో సీతై, ప్రియముడన్, భగవతి, అన్బే శివం తదితర పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. చివరగా ఈ సంస్థ జయం రవి హీరోగా సకల కళా వల్లవన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ ముగ్గురు నిర్మాతల్లో ఒకరైన స్వామినాథన్ కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇటీవలకు కరోనా వ్యాధి సోకింది. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం కన్నుమూశారు. నిర్మాత స్వామినాథన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
బాధితులకు జయలలిత పరామర్శ
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కుప్పకూలిపోయిన ప్రాంతాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిశీలించారు. మాన్‌గాడులో శిథిలాల కింద చిక్కుకున్న వారి కో్సం చేపడుతున్న సహాయక చర్యలను తెలుసుకుని, బాధితులను పరామర్శించారు. శిథిలాల నుంచి శ్రీకాకుళంకు చెందిన కృష్ణవేణి అనే మహిళను రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకు తీశారు. కాగా చెన్నైలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మరణించగా, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా తెలుగువారు ఉన్నారు.