రూ.40 లక్షల జీతం.. ఆ సంబంధం వద్దన్నా | Karnataka Woman Rejects 40 Lakh Marriage Proposal Over Instagram Profile | Sakshi
Sakshi News home page

రూ.40 లక్షల జీతం.. ఆ సంబంధం వద్దన్నా

Aug 24 2026 8:45 AM | Updated on Aug 24 2026 9:12 AM

Karnataka Woman Rejects 40 Lakh Marriage Proposal Over Instagram Profile

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభిమానినని చెప్పుకున్న యువకునికి అమ్మాయి నుంచి తిరస్కారం ఎదురైంది. అతడు నెలకు రూ.40 లక్షలు సంపాదిస్తున్నా కూడా  పెళ్లికి ససేమిరా అంది. బెంగళూరులో ఆరూహి రెడ్డి అనే అమ్మాయి వివరాలను ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఆమెకు ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉన్నారు, ఇటీవల ఓ సంబంధం తీసుకువచ్చారు. యువకుడు అందగాడు, నెలకు రూ.40 లక్షలు సంపాదిస్తాడు, మంచి కుటుంబమని బంధువులు తెలిపారు. అయితే ఆ అబ్బాయి అతని ప్రొఫైల్‌లో రాహుల్‌గాంధీ అభిమానినని రాసుకున్నాడు. 

ఇది చూసిన ఆరూహిరెడ్డి ఈ ఒక్క కారణంతో మూడుముళ్ల బంధానికి నిరాకరించినట్టు తెలిపింది. వరుసగా అపజయాలు మూటగట్టుకుంటున్న రాహుల్‌గాం«దీని రోల్‌ మోడల్‌గా చెప్పుకునే వ్యక్తి ఐక్యూ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని పలు తీవ్ర విమర్శలు చేసింది. నీలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోలేనని, అందం,అంతస్తు, డబ్బు కంటే దేశభక్తి, మతం మీద ప్రేమ, భక్తి ఉండడం ఎంతో అవసరమని తేల్చిచెప్పింది. ఈ పోస్టుతో నెటిజన్లు కొందరు ఆరూహిరెడ్డిని అభినందిస్తుంటే మరికొందరు దూషిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement