ఇన్‌స్టాలో 15 ఏళ్ల బాలుని ప్రేమ.. ఆత్మహత్యాయత్నం | 15 Years Boy Love Incident | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాలో 15 ఏళ్ల బాలుని ప్రేమ.. ఆత్మహత్యాయత్నం

Aug 25 2026 9:24 AM | Updated on Aug 25 2026 9:25 AM

15 Years Boy Love Incident

సాక్షి, బెంగళూరు: సోషల్‌ మీడియా ప్రేమల్లో పడి యువత, బాలలు పెడదారి పడుతున్నారు. ప్రాణాలు తీసుకోవడానికీ సంకోచించడం లేదు. బెంగళూరులో 15 ఏళ్ల బాలుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు యత్నించాడు . వివరాలు.. బేగూరు వద్ద అక్షయ నగరలో బాలునికి ఇన్‌స్టాలో ఒక అమ్మాయి పరిచయం ఏర్పడింది. 3 నెలల నుంచి ఇద్దరూ ఫోన్‌లో కూడా మాట్లాడుకుంటున్నారు.  

ఆదివారం సాయంత్రం యువతి అతనికి కాల్‌ చేసి తనకు నిశ్చితార్థం అయిందని, ఇకపై ఫోన్‌ చేయొద్దని చెప్పింది. దీంతో ఆవేశానికి లోనైన బాలుడు ఎలుకల మందు తాగి చనిపోతానని హెచ్చరించాడు. అలాగే భవనం 6వ అంతస్తుకు వెళ్లి అక్కడ నుంచి కిందకి దూకి చనిపోతానని బెదిరించాడు. యువతి పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పగా, అక్కడికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి అతన్ని కిందికి తీసుకువచ్చారు. బాలిక, యువతిని మందలించారు.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement