సీజేఐకు లేఖ రాసిన జస్టిస్ మెహతా
న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై ఆరోపణలు గుప్పిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా నాలుగోసారి లేఖాస్త్రం సంధించారు. ఆగస్ట్ 30న రాసిన ఈ లేఖ తాజాగా వెలుగులోకి వచి్చంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ సంజీవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు జస్టిస్ మెహతా నాలుగో లేఖ రాశారు.
గతంలోనే జస్టిస్ మెహతా ఆగస్ట్ 2, 10, 17 తేదీల్లో లేఖలు రాయడం విదితమే. అంతర్గత జ్యుడీíÙయల్ విచారణలో జస్టిస్ శర్మ దురుద్దేశంతో కలగజేసుకుంటున్నారని తాజా ఆరోపణలుచేశారు. అయితే జస్టిస్ శర్మ వైఖరిని నిరసిస్తూ రాజస్థాన్ హైకోర్టులో పలువురు న్యాయవాదులు ధర్నాకు దిగడంతో జస్టిస్ శర్మ సెలవుపై వెళ్లారు. ‘‘జస్టిస్ శర్మ కోర్టు పరిపాలనా వ్యవహారాల్లో పూర్తి గా విఫలమయ్యారు. బంధు ప్రీతి చూపిస్తున్నారని, తప్పుడు తీర్పులు ఇస్తున్నారు.
సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల, సంపన్నుల జోక్యమున్న కేసులనే ఈయన విచారణకు తీసుకుంటూ మిగతా కేసులను ఇతర ధర్మాసనాలకు సిఫార్సుచేస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. భూ వివాదాల్లో జ్యుడీíÙయల్ జోక్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారీస్థాయిలో అవినీతికి పాల్పడుతూ హైకోర్టులో కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారు’’అని లేఖలో పేర్కొన్నారు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హోదాలో కేసులను ఏఏ జడ్జీలకు కేటాయించాలనే మాస్టర్ ఆఫ్ రోస్టర్ నిబంధనను ఈయన ఇష్టారీతిన ఉల్లంఘిస్తున్నారని విజ్ఞప్తిచేశారు. అయితే ఆరోపణలపై బలమైన సాక్ష్యాధారాలు ఉంటే సమర్పించాలని సీజేఐ ఆగస్ట్ 26వ తేదీన స్పందించడం తెల్సిందే.


