బుక్‌ మై షో ద్వారా ప్రధాని ఈవెంట్‌  | PM Narendra Modi Vadodara event sells out on BookMyShow in an hour | Sakshi
Sakshi News home page

బుక్‌ మై షో ద్వారా ప్రధాని ఈవెంట్‌ 

Sep 8 2026 5:10 AM | Updated on Sep 8 2026 6:11 AM

PM Narendra Modi Vadodara event sells out on BookMyShow in an hour

పూర్తిగా డిజిటల్‌ రిజి్రస్టేషన్‌ 

గంటలో హౌస్‌ఫుల్‌

వడొదర: గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమ నిర్వహణ మొదటిసారిగా ‘బుక్‌ మై షో’ద్వారా జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్దేశించిన ఉచిత రిజి్రస్టేషన్‌కు భారీ స్పందన కూడా లభించింది. ప్రారంభించిన గంటలోనే టిక్కెట్లు మొత్తం బుక్‌ అయిపోయాయి. మంగళవారం నాటి కార్యక్రమాల్లో ప్రధాని సుమారు 35 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. 

దీంతోపాటే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొట్ట మొదటిసారి ప్రైవేట్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షో ద్వారా రిజి్రస్టేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రారంభించిన గంటలోనే సుమారు 42,000 మంది వెయిటింగ్‌ లిస్ట్‌లోకి చేరడంతో బుక్‌ మై షో తదుపరి రిజి్రస్టేషన్‌ను నిలిపివేసింది. 

ప్రధాని కార్యక్రమంలో ప్రవేశానికి కూడా పూర్తిస్థాయి డిజిటట్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బుక్‌ మై షో ద్వారా రిజి్రస్టేషన్‌ చేసుకున్న వారికి వారి అకౌంట్‌ ద్వారా డిజి టల్‌ ఎం–టికెట్‌ లభిస్తుంది. ఇందులోని క్యూ ఆర్‌ కోడ్‌ను ఉపయోగించి కార్యక్రమం జరిగే ప్రాంగణంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. రి జి్రస్టేషన్‌ మొదలుకొని సీటింగ్‌ ఏర్పాట్ల వర కూ అన్నీ డిజిటల్‌ పద్ధతిలోనే జరగనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement