కోర్టుకు దర్శన్‌ అవసరమా? | Actor Darshan Renukaswamy Murder Case Incident | Sakshi
Sakshi News home page

కోర్టుకు దర్శన్‌ అవసరమా?

Sep 12 2026 9:48 AM | Updated on Sep 12 2026 9:49 AM

 Actor Darshan Renukaswamy Murder Case Incident

బెంగళూరు: చిత్రదుర్గ  రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్‌ కోర్టుకు హాజరు కావడానికి అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీశానంద విచారించారు. సాక్షుల విచారణ సమయంలో నిందితుడు దర్శన్‌ కోర్టులో స్వయంగా హాజరు కావాలని ఆయన న్యాయవాది వాదించారు. జడ్జి స్పందిస్తూ దర్శన్‌ను కోర్టుకు తీసుకొస్తే పోలీసు భద్రత ఇవ్వాల్సి ఉంటుంది, జనం రద్దీని అడ్డుకోవడం కష్టమని అన్నారు.  వీలైతే పరప్పన అగ్రహార జైలులోనే విచారణ జరపవచ్చు. వ్యక్తిగత హాజరు కంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చాలా సులువుగా ఉంటుందని తెలిపారు. ఇరువర్గాలూ మాట్లాడుకుని ఒక తీర్మానానికి రావాలని, వాయిదాలకు ప్రతిసారీ నిందితులు రావాల్సిన అవసరం లేదని జడ్జి చెప్పడం గమనార్హం.   

వన్యప్రాణుల కేసు?  
మైసూరు జిల్లా టి నరసీపుర రోడ్డులో ఉన్న దర్శన్‌ ఫౌంహౌస్‌లో గతంలో అరుదైన పక్షులు, వన్యజీవులు ఉన్నట్లు వీడియోలు వచ్చాయి. అటవీశాఖ నిబంధనలకు విరుద్ధం కావడంతో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement