మంచిర్యాలలో దారుణం.. వివాహితను గొడ్డలితో నరికి చంపిన బంధువు! | Mancherial Dandepalli Married Woman Murdered Relative Absconding | Sakshi
Sakshi News home page

మంచిర్యాలలో దారుణం.. వివాహితను గొడ్డలితో నరికి చంపిన బంధువు!

Sep 9 2026 12:15 AM | Updated on Sep 9 2026 12:19 AM

Mancherial Dandepalli Married Woman Murdered Relative Absconding

తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ వివాహితను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దండేపల్లి మండలం నిల్కి వెంకటాపూర్‌లో సింగతి లక్ష్మి (37) అనే వివాహిత నివాసం ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఆమె బంధువు సింగతి రవి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఆమెను అతి కిరాతకంగా గొడ్డలితో విచక్షణ రహితంగా నరికి చంపాడు. దీంతో సింగతి లక్ష్మి అక్కడికక్కడే ప​్రాణాలు విడిచింది. అయితే నిందితుడు హత్యచేసిన వెంటనే ఘటనా స్థలంనుంచి పరారయ్యాడు. ఈ సంఘటనతో గ్రామంలోని స్థానికులలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిందితుడిని పట్టుకున్నాకే పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement