ఫిర్యాదుదారులు నేరుగా కలవొచ్చు గడువులోపు ఎస్‌ఐఆర్ పూర్తి చేస్తాం కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ హర్ష్ చౌదరి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి
సాక్షి: సివిల్స్ వైపు రావడానికి ఇనిస్పిరేషన్ ఎవరు?
సబ్ కలెక్టర్: 2015లో నేను చైన్నెలో చదువుకుంటున్న సమయంలో వరదలొచ్చాయి. ఆ వరదల్లోంచి బయపడిన వారిలో నేనూ ఒకడిని. ఆ సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధి కారులు అందించిన సేవలు నన్ను ప్రభావితం చేశా యి. అధికారులు ప్రాణాలకు తెగించి ప్రజలను కా పాడిన తీరు నా మనసులో చెరగని ముద్రవేసింది. ఆ తర్వాత నేను సివిల్ సర్వీస్‌లో చేరాలనే తపన మినహా రెండో ఆలోచనే రాలేదు. నేను శ్రీరామ్ కా లేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాను. తోటి స్నేహితులు, బ్యాచ్‌మెట్స్ అందరితో పాటు కార్పొరేట్ కెరీర్ గురించి ఆలోచించలేదు.
సాక్షి: మీ కుటుంబ నేపథ్యం?
సబ్ కలెక్టర్: నేను రాజస్థాన్ రాష్ట్రం జోద్‌పూర్‌లోని సంగనీర్‌లో జన్మించాను. మాది సాధారణ వ్యవసా య కుటుంబం. తమ్ముడు, నేను కవలలం. తమ్ము డు కార్పొరేట్ సంస్థలో చార్టెడ్ ఎకౌంటెంట్‌గా చేస్తున్నాడు. నా విద్యాభ్యాసం చైన్నెలో జరిగింది. దేశంలోనే ఒకటైన ఢిల్లీ శ్రీరామ్‌కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్‌ఆర్‌సీసీ)లో చదివినప్పటికీ రూ.లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగం వైపు వెళ్లకుండా ప్రజాసే వకే అంకితం కావాలని నిర్ణయించుకున్నాను.
సాక్షి: సివిల్స్ లక్ష్యంలో ఎదురైన అవాంతరాలు?
సబ్ కలెక్టర్: సివిల్స్ ప్రయాణమంతా సులభంగా సాగలేదు. ఇది ఓర్పునకు పరీక్ష. చాలాసార్లు ఫెయి ల్ అవుతామేమో అనే భయం ఉంటుంది. నిద్రలేని రాత్రులు గడపాల్పి వచ్చేది. స్నేహితులు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. పట్టుదలతో యూ పీఎస్సీ 2023టాపర్‌గా నిలిచాను. తెలంగాణ 2024 బ్యాచ్‌లో ట్రైనింగ్ పూర్తి చేశాను. 2025లో వికారా బాద్‌లో అసిస్టెట్ కలెక్టర్‌గా చేరాను. ప్రస్తుతం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాను.
సాక్షి: మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా..?
సబ్ కలెక్టర్: అమ్మానాన్న ఇప్పటికీ ఒక్కటే చెబుతా రు. అధికారం అనేది సేవ చేయడానికి వచ్చిన అవకాశం. పేదల కష్టాన్ని అర్థం చేసుకుని వారి గొంతుకగా ఉండాలని సూచిస్తుంటారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వారి త్యాగమే కారణం.
సాక్షి: కాగజ్‌నగర్ డివిజన్‌లోని గిరిజన ప్రాంతంపై మీ మార్క్.. భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?
సబ్ కలెక్టర్: పోడు భూములు 22ఏ, విద్య, వైద్యం, గ్రామాలాభివృద్ధి, వలసలు, మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాను. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా. యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేసి విద్యార్థులు రెగ్యులర్‌గా పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకుంటాను.
సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం?
సబ్ కలెక్టర్: యువత లక్ష్యాలను ఎంచుకోవాలి. రో జూ ఉదయాన్నే లేచి వ్యాయామం, యోగా చేసి మ నస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలి. తల్లిదండ్రులు ఒత్తిడి లేకుండా పిల్లలను ప్రోత్సహించాలి.
సివిల్ సర్వీస్‌లోకి రావడానికి తనకు ఒక విషాద అనుభవమే ప్రేరణ అని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి తెలిపారు. సివిల్స్ సాధనకు నిద్రలేని రాత్రులు గడిపానని పేర్కొన్నారు. కాగజ్‌నగర్ డివిజన్‌లోని వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేషించుకుని పట్టుదలతో శ్రమించి విజయం సాధించాలని యువతకు పిలుపున్చిచారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. – కాగజ్‌నగర్‌టౌన్
సాక్షి: ఫిర్యాదులపై ఎలా స్పందిస్తారు?
సబ్ కలెక్టర్: డివిజన్ పరిధిలోని సమస్యలు నా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పరిశీలిస్తాను. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలు పరిశీలించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించేలా చూస్తాను. రెవెన్యూ సమస్యలు పారదర్శకంగా పరిష్కరించడానికి కృషి చేస్తాను. ఫిర్యాదుదారులు నేరుగా నన్ను కలిసి ఫిర్యాదు చేయవచ్చు.
సాక్షి: ఎస్‌ఐఆర్‌లో హియరింగ్‌కు వచ్చేవారు ఇబ్బందులకు గురవుతున్నారు?
సబ్ కలెక్టర్: భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి అనర్హులు జా బితాలో లేకుండా చూసేందుకు ఎస్‌ఐఆర్ జూన్ 25 నుంచి చేపట్టింది. అర్హులైన ఓటరు టు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నాం. నోటీసులు వచ్చిన ఓటర్లు 11రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకువచ్చి బీఎల్వోలకు అందజేయాలి. ఇప్పటివరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ 45శాతం పూర్తి చేశాం. అధికారులు, ప్రజల సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు 100శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. నూతన ఓటర్లు ఫారం–6, చ నిపోయిన, డూప్లికేట్ ఓటర్లు అభ్యంతరాలు తెలి యజేసేందుకు ఫారం–7, మొబైల్ నంబర్ అప్‌డే ట్, చిరునామా మార్పులు, ఓటరు గుర్తింపు కార్డులో వివరాల సవరణలకు ఫారం–8 అందజేయాలి.


