కార్మికుడికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

కార్మికుడికి పరామర్శ

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిలో ఈ నెల 7న మిస్‌ఫైర్‌ జరిగి గాయపడిన కోల్‌కట్టర్‌ కార్మికుడు గోగుల రమేశ్‌ను మంగళవారం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పరామర్శించా రు. కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించారు. ఏఐటీయూసీ అండగా ఉంటుందని రమేశ్‌కు భరోసా ఇచ్చా రు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిట్టపల్లి వెంకటస్వామి, కార్యదర్శి ఎండీ అక్బర్‌అలీ, బెల్లంపల్లి బ్రాంచ్‌ కార్యదర్శి దాగం మల్లేశ్‌, నాయకులు సుదర్శన్‌, లింగయ్య, రాజేశ్వర్‌రావులున్నారు.

లేడీస్‌ టైలర్‌ దగ్ధం

నెన్నెల: మండల కేంద్రంలోని కుశ్నపల్లి చౌరస్తాలోగల ఓ లేడీస్‌ టైలర్‌ మంగళవారం తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున బ్లూకోల్ట్స్‌ విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్‌ లేడిస్‌ టైలర్‌ షాపులో మంటలు రావడాన్ని గమనించి ఎస్సైకి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఇద్దరు మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎంబ్రాయిడర్‌, మగ్గం మిషన్లు, జుక్కి కుట్టు మిషన్‌, కస్టమర్ల దుస్తులు, కౌంటర్లు కాలిపోయాయి. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు బద్ది కృష్ణవేణి తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

డంప్‌యార్డులో మోటార్ల చోరీ

రామకృష్ణాపూర్‌: స్థానిక ఆర్‌కే–1 గని సమీపంలోని డంప్‌యార్డులో క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన రెండు 5 హెచ్‌పీ ష్రెడింగ్‌ మోటార్లు అపహరణకు గురయ్యాయి. డంప్‌యార్డులో మోటార్లను అపహరించినట్లు మంగళవారం ఉదయం గుర్తించిన మున్సిపల్‌ సిబ్బంది విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణ స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోటార్ల విలువ దాదాపు రూ.లక్షన్నర వరకు ఉంటుందని పేర్కొన్నారు. డంప్‌యార్డులోకి ఎవరు వచ్చారు? ఏ రూట్‌లో వచ్చారు? అనేది సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement