ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ... డిప్యూటీ సీఎం | Deputy CM condemns inappropriate remarks against the Speaker | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ... డిప్యూటీ సీఎం

Sep 8 2026 5:21 PM | Updated on Sep 8 2026 5:57 PM

Deputy CM condemns inappropriate remarks against the Speaker

సాక్షి, హైదరాబాద్‌: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌ భావజాలం, ఆలోచన స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. ఈ రోజు మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఇది స్పీకర్‌కు కాదు సభకు జరిగిన అవమానం అని తెలిపారు.  తాతా మధు, నవీన్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సభ తీర్మానించిందన్నారు.

యావత్ చట్టసభనే బీఆర్‌ఎస్‌ సభ్యులు అవమానించారు. సభాపతిని అంటే సభ మెుత్తాన్ని అన్నట్లే దళిత వర్గాల్లో పుట్టి ఎదిగి వచ్చిన వ్యక్తి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ అని తెలిపారు. ఫ్యూడల్‌ విధానం మీద పోరాడిన చరిత్ర ఈ సభకు ఉందన్నారు. ఫ్యూడల్‌ భావజాలం నుంచి పుట్టిందే బీఆర్‌ఎస్‌ అని ప్రస్తుతం ఫాంహౌజ్‌ కుట్ర నడుస్తోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తాతా మధు, నవీన్‌ రెడ్డిలపై చర్యలకు మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భట్టివిక్రమార్క బలపరిచారు. తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌కు పంపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement