Khairatabad Ganesh: రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర షురూ | Khairatabad Ganesh Shobha Yatra In Tomorrow 7AM | Sakshi
Sakshi News home page

Khairatabad Ganesh: రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర షురూ

Sep 24 2026 7:32 AM | Updated on Sep 24 2026 7:55 AM

Khairatabad Ganesh Shobha Yatra In Tomorrow 7AM

ఖైరతాబాద్‌: శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన  69 అడుగుల మహాగణపతి దర్శనాలు బుధవారంతో ముగియడంతో నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం నుంచి షెడ్డు తొలగింపు, నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేసి శుక్రవారం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఖైరతాబాద్‌ రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్, ఎక్బాల్‌మినార్‌ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నెం– 4 వద్ద నిమజ్జనం చేసేలా పోలీసులు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. గత ఏడాది లాగే ఈసారి కూడా ఎం.వెంకట్‌రెడ్డి మహాగణపతి రథసారథిగా వ్యవహరించనున్నారు.  

వెల్డింగ్‌ పనులు పూర్తి.. 
మహా గణపతి నిమజ్జనానికి విజయవాడ ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన భారీ ట్రాయిలర్‌ వాహనం బుధవారం ఇక్కడికి చేరుకుంది. వోల్వో ఇంజిన్‌ టెక్నాలజీతో నడిచే ఈ వాహనం 65 టన్నుల బరువును మోస్తుంది. 75 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 26 టైర్లున్న ఈ వాహనంపై 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 50 టన్నుల బరువున్న మహాగణపతి ఏర్పాటు చేసేందుకు వీలుగా వెల్డింగ్‌ పనులు పూర్తి చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement