PC: Twitter
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం భారత్ ఖాతాలో 13 పతకాలు వచ్చి చేరాయి. స్వర్ణం రాకపోయినప్పటికీ, మన అథ్లెట్లు రజతాలు, కాంస్యాలతో పతకాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటివరకు భారత్ 43 పతకాలు గెలుచుకోగా.. ఇందులో 4 స్వర్ణాలు, 19 రజతాలు, 20 కాంస్యాలున్నాయి.
గుల్వీర్‌కు మరో రజతం
భారత లాండ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ ఆసియా గేమ్స్‌లో రెండో రజతంతో మెరిశాడు. ఇప్పటికే 10వేల మీటర్ల పరుగులో రజతం గెలిచిన గుల్వీర్ సోమవారం జరిగిన 1500 మీటర్ల ఫైనల్‌లో రెండో స్థానంలో వెండి పతకాన్ని కొల్లగొట్టాడు. 1500 మీటర్ల రేసును గుల్వీర్ 3:36.72 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.
𝐆𝐔𝐋𝐕𝐄𝐄𝐑 𝐒𝐈𝐍𝐆𝐇 𝐎𝐍 𝐓𝐇𝐄 𝐏𝐎𝐃𝐈𝐔𝐌! 🥈
A strong 1500m run sees him finish second and add another medal to India’s tally! ✨
Watch the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames… pic.twitter.com/wsYKwYJlWl— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2026
చివరి నిమిషం వరకు టాప్‌లో ఉన్న గుల్వీర్‌కు.. జపాన్ అథ్లెట్ కజుటో ఇజావా ఊహించని షాక్ ఇచ్చాడు. ఫినిష్ లైన్ సమీపిస్తున్న తరుణంలో కజుటో ఇజావా పుంజుకుని కేవలం 0.37 సెకన్ల తేడాతో గుల్వీర్‌ను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక జపాన్‌కే చెందిన జపాన్‌కు చెందిన నగియా మోరీ 3:37.92 నిమిషాల్లో రేసును పూర్తి చేసి కాంస్యం కైవసం చేసుకున్నాడు.
పీటీ ఊష రికార్డు బ్రేక్..
అంతకముందు మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌లో భారత అథ్లెట్ విథ్యా రామ్‌రాజ్ దిగ్గజం పీటీ ఉష రికార్డును బ్రేక్ చేయడమే గాక కాంస్య పతకంతో మెరిసింది. 400 మీటర్ల హార్డిల్స్‌ను విథ్యా రామ్‌రాజ్ 54.75 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఒడిసిపట్టింది.

PC: Twitter
కాగా 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌లో పీటీ ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల టైమింగ్‌ను 0.67 సెకన్ల వ్యవధిలో బద్దలుకొట్టిన విథ్యా రామ్‌రాజ్ తన పేరును లిఖించుకుంది. ఇక యూఏఈకి చెందిన మరియమ్ కరీమ్ (54.31 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, కజకిస్తాన్‌కు చెందిన అడెలినా జెమ్స్ (54.58 సెకన్లు) రజతం కైవసం చేసుకుంది.
🥉 कांस्य पदक
विथ्या रामराजने AsianGames2026 में महिलाओं की 400 मीटर हर्डल्स में कांस्य पदक जीती
—उन्होंने पी.टी. उषा के पिछले राष्ट्रीय रिकॉर्ड को तोड़ा!#AsianGames2026 #VithyaRamraj #Athletics pic.twitter.com/IhEvgTaBL9— @p2- चंद्रवंशी 🇮🇳 (@pra1366) September 28, 2026
లాంగ్ జంప్‌లో మురళీకి రజతం
భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ సత్తా చాటాడు. పురుషుల లాంగ్ జంప్ విభాగంలో మురళీ 8.07 మీటర్ల దూరం దూకి రజతం సొంతం చేసుకున్నాడు. గత ఆసియా గేమ్స్‌లోనూ రజతమే సాధించిన మురళీ ఈసారి స్వర్ణం కోసం ప్రయత్నించాడు. అయితే చీలమండ గాయంతో చివరి రెండు ప్రయత్నాలు విరమించుకోవడంతో మురళీ శ్రీ శంకర్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే చివరి రెండు ప్రయత్నాల్లో మురళీ పాల్గొననప్పటికీ తన బెస్ట్ (8.07 మీటర్లు)ను ఎవరు అధిగమించకపోవడం విశేషం. కొరియాకు చెందిన లిన్ యూ టోంగ్ (8.05 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా.. అన్వరోవ్ అన్వోర్ (8.06 మీటర్లు) దూకి రజతం గెలుచుకున్నాడు.
పారుల్ చౌదరీకి కాంస్యం..
భారత స్టార్ స్ప్రింటర్ పారుల్ చౌదరీ ఆసియా గేమ్స్‌లో రెండో పతకం సాధించింది. ఇప్పటికే 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్‌లో కాంస్యం సాధించిన పారుల్ చౌదరీ సోమవారం 5వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ రేసులో కాంస్యం ఒడిసిపట్టింది. ఆమె గమ్యాన్ని 15:14.61 సెకన్లలో పరుగు పూర్తి చేసింది.
తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కంటే 10 సెకన్లు ఆలస్యంగా పరుగెత్తిన పారుల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే గత ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం పట్టేసిన పారుల్ ఈసారి కంచుమోతతోనే సరిపెట్టుకుంది. ఇక బహ్రెయిన్ అథ్లెట్ విన్‌ఫ్రెడ్ యవి 15:10.18 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకం నెగ్గగా.. జపాన్ అథ్లెట్ నజోమి టనక (15:11.65 సెకన్లు) రజతం సొంతం చేసుకుంది.
Congratulations to Parul Chaudhary on once again, winning the Bronze Medal in the Women’s 5000m at the #AsianGames2026! #Cheer4Bharat pic.twitter.com/E0DrL8leUb
— Kiren Rijiju (@KirenRijiju) September 28, 2026
ఇదీ చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. భారత ఓపెనర్ డబుల్ సెంచరీ


