తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు | NATS Expands Social Service Initiatives in Andhra Pradesh, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు

Sep 28 2026 3:54 PM | Updated on Sep 28 2026 4:09 PM

NATS service activities in the Telugu states

నాట్స్ (నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ) చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగుల తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని “హృదయాలయం” ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు.

“సంబరం లో సేవ” కార్యక్రమంలో భాగంగా ణాట్శ్ రూ.80 లక్షల విరాళాన్ని అందించింది. ఈ మొత్తాన్ని పలు సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించినట్లు ణాట్శ్ వెల్లడించింది. కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ ప్రత్యేక మనసిక వికలాంగులైన చిన్నారులతో మమేకమై, వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సు, ఫిజియోథెరపీ సేవలను పరిశీలించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసి, పాఠశాల, పునరావాస కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించారు. మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని దివ్యాంగులకు సైతం సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని నాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. 

దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా తొర్రేడు గ్రామంలో గోపి (షాప్ నంబర్ 162), వెంకటానగర్‌లో దేవదాసు చినబాబు (షాప్ నంబర్ 161)లకు కేటాయించిన కిరాణా దుకాణాలకు నాట్స్ ఒక్కొక్కదానికి రూ.1.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ రెండు దుకాణాలను కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ, సాయి గంగుల ప్రారంభించారు. వెన్నెముకకు గాయాలై మంచానికే లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన బాధితులకు హోప్4స్పందన అందిస్తున్న నెలవారీ మెడికల్ కిట్ కార్యక్రమానికి కూడా నాట్స్ సహకరిస్తోంది. హైదరాబాద్‌లో రాజ్ అల్లాడ ఈ కిట్లను పరిశీలించారు. 

యూరినల్ బ్యాగులు, డైపర్లు, క్యాథిటర్లు, కాటన్ రోల్స్, బెటాడిన్, డెటాల్, గ్లౌజులు తదితర 13 రకాల అత్యవసర వస్తువులు ఇందులో ఉన్నాయి. అనంతపురంలోని ఆశ్రయ అనాథ ఆశ్రమం, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమం లో శాశ్వత ఆశ్రయాల కోసం కూడా నాట్స్ సహకారం అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాలను హోప్4స్పందన ఆంధ్ర–తెలంగాణ సమన్వయకర్త డాక్టర్ రఘు ఆరికపూడి సమన్వయంతో నిర్వహిస్తున్నారు. నిడదవోలు,రాజమండ్రి లో జరిగిన సామాజిక సేవల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డా గణేష్ బాబు గారు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలక్ష్మీ గారు, దయ్యాల మహేష్ గారు పాల్గొన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రవాస భారతీయులకు నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో సమాజ సంక్షేమానికి తమ సేవలను మరింత విస్తరించేందుకు నాట్స్ కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement