9/11 అమరులకు నివాళిగా ‘గ్రాడ’ మెగా రక్తదాన శిబిరం | GRADA hosted blood drive event coinciding around 9/11 remembrance | Sakshi
Sakshi News home page

9/11 అమరులకు నివాళిగా ‘గ్రాడ’ మెగా రక్తదాన శిబిరం

Sep 27 2026 1:04 PM | Updated on Sep 27 2026 1:04 PM

 GRADA hosted blood drive event coinciding around 9/11 remembrance

అమెరికాలో  9/11 ఉగ్రదాడుల అమరులను స్మరిస్తూ, 'గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా' (GRADA) ఆధ్వర్యంలో కార్టర్ బ్లడ్‌కేర్ సహకారంతో నిర్వహించిన 4వ మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. డల్లాస్ - ఫ్రిస్కోలోని స్పైసీ వెన్యూ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను, రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితం కోసం గ్రాడ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డా. దర్గా నాగిరెడ్డి, చెన్నా రెడ్డి కొర్విలకు గ్రాడ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. 

వారి మార్గదర్శకత్వంలోనే సమాజానికి ఉపయుక్తమైన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించగలుగుతున్నామని పేర్కొంది. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన కోఆర్డినేటర్లు ఉమా మహేశ్వర్, హరినాథ్, జగదీష్‌లతో పాటు చురుగ్గా పాల్గొన్న యువ వాలంటీర్లకు గ్రాడ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గాలి, కార్యదర్శి రాజు కంచం, ఈసీ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

రక్తదాన శిబిరానికి స్థలాన్ని కేటాయించి పూర్తి సహకారం అందించిన స్పైసీ వెన్యూ రెస్టారెంట్ యజమాని సునీల్‌కు, ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన రక్తదాతలందరికీ గ్రాడ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.

ఇదీ చదవండి: జపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement