చరిత్రలోనే ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. రోడ్లపై అడుగు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్లు, అపార్ట్‌మెంట్ ప్రాంగణాలు, మార్కెట్లు నీట మునగడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎటు చూసినా నీరే కనిపిస్తుండగా.. ఆ వరద నీటిలో పాములు, చేపలు తేలుతూ కనిపించడం మరింత కలవరపెడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఈ భయానక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బ్యాంకాక్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు కిటికీల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అపార్ట్‌మెంట్ ప్రాంగణాల్లో పార్క్ చేసిన వాహనాల్లో పైకప్పులు మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. వరద నీటిలో పాములు, చేపలు సైతం కొట్టుకొస్తూ కనిపించడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో వీటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతో మరింత బెంబేలెత్తిస్తున్నారు.
📍Bangkok ,Thailand 🇹🇭
"Bangkok is flooded, even the fish 🐟 🐠 🐟 are on the streets 🛣️ !
Before, traffic jams were caused by too many cars, now you might still need to watch out for fish in the water"#bangkok #thailand #heavyrain #climatechange #Elnino #flooding… pic.twitter.com/p6b1x2KWLp— sustainme.in® (@sustainme_in) September 28, 2026
Banjir di Bangkok pic.twitter.com/zpQzpWdcqd
— @ (@anthraxxxx) September 26, 2026
ప్రధాన రహదారులపైనా భారీగా నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి జెట్‌స్కీ(బోట్ తరహా వాహనం)తో వరద ముంచెత్తిన రోడ్డుపై దూసుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థాయ్ పోలీసులు చర్యలు తీసుకుని అతడిని అరెస్టు చేశారు.
थाईलैंड में भीषण बाढ़ की वजह से सड़कों पर विशालकाय रेटिकुलेटेड पायथन तौर रहे हैं. किसी जानवर को निगलने के कारण अजगर का पेट काफी फूला हुआ था, जिसके चलते यह पानी में ठीक से तैर या हिल-डुल नहीं पा रहा था.
दूसरी तरफ घरों के भीतर भी जहरीले सांप घुस रहे हैं, pic.twitter.com/2AhvcpdbZ1— Ruby Arun रूबी अरुण (@arunruby08) September 26, 2026
మీటర్ లోతు నీటిలో..
బ్యాంకాక్‌లోని బాంగ్ కాపి ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని చోట్ల వరద నీరు దాదాపు మీటర్ వరకు చేరింది. అయినప్పటికీ వ్యాపారులు దుకాణాలు మూసివేయకుండా వినూత్నంగా వ్యాపారం కొనసాగించారు. ప్లాస్టిక్ క్రేట్లు, ఫోమ్ బాక్సులు, బేసిన్లను నీటిపై తేలేలా చేసి వాటిలో కూరగాయలు, చేపలు, మాంసం, ఇతర నిత్యావసరాలను విక్రయించారు. ప్రజలు నీటిలోనే నడుచుకుంటూ సరుకులు కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ మొత్తం ఓ ‘ఫ్లోటింగ్ మార్కెట్’ను తలపించింది.

7 లక్షల మందిపై ప్రభావం
వారాంతపు వరదలకు బ్యాంకాక్‌లో 3.29 లక్షల కుటుంబాలు.. దాదాపు 7 లక్షల మంది ప్రభావితమైనట్లు నగర అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. అయితే సోమవారం నుంచి వర్షం కొంత తగ్గడంతో అధికారులు డ్రైనేజీ, నీటి తొలగింపు చర్యలను వేగవంతం చేశారు.
తాజా అధికారిక సమాచారం ప్రకారం.. బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. సెప్టెంబర్ 28 నాటికి దేశవ్యాప్తంగా 27 ప్రావిన్సులు, బ్యాంకాక్‌లో వరదల ప్రభావం ఉన్నట్లు థాయ్ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 5.76 లక్షల కుటుంబాలు, 17.93 లక్షల మంది ప్రభావితమైనట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతుండగా.. మరికొన్ని చోట్ల ఇంకా పెరుగుతున్నాయి.
విమానాశ్రయంలో భారీగా లగేజీలు..
వరద ప్రభావం బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయానికీ తాకింది. వరదల కారణంగా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది విధులకు చేరుకోవడం కష్టమైంది. దీంతో బ్యాగేజీ నిర్వహణలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 6 వేల బ్యాగేజీలు ఆలస్యమైనట్లు సమాచారం. కొన్ని బ్యాగేజీ ట్రాలీలు కూడా పనిచేయకపోవడంతో టెర్మినల్‌లో లగేజీ భారీగా పేరుకుపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు థాయ్ ఎయిర్‌వేస్ కార్యాలయ సిబ్బంది, మేనేజర్లు, సైనిక సిబ్బందిని రంగంలోకి దించింది. ప్రయాణికులకు నేరుగా వాళ్ల ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
వరదల తీవ్రత దృష్ట్యా థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, ఆసుపత్రులు తదితరాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
వర్షం తగ్గినా.. ముప్పు మాత్రం!
తాజా పరిస్థితిలో బ్యాంకాక్‌లో వర్షం కొంత తగ్గుముఖం పట్టింది. ప్రధాన కాలువల్లో నీటిమట్టాలను తగ్గించి.. రోడ్లు, నివాస ప్రాంతాల్లోని నీటిని బయటకు పంపేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. మరోవైపు థాయ్ వాతావరణ శాఖ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, నదులు పొంగిపొర్లడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది.
ఇదీ చదవండి: ఇరాన్ ఎట్టకేలకు దిగొచ్చిందా?


