ఏఐ కట్టడికి ఎన్‌విడియా సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌! | Nvidia has announced its Open Agent Safety Platform | Sakshi
Sakshi News home page

ఏఐ కట్టడికి ఎన్‌విడియా సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌!

Sep 29 2026 6:08 AM | Updated on Sep 29 2026 6:08 AM

Nvidia has announced its Open Agent Safety Platform

ఓపెన్‌ షెల్‌ పేరుతో అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ 

ఏఐ ఏజెంట్ల హద్దులు నిర్ణయిస్తుందని వెల్లడి 

కార్యకలాపాలపై నిఘాకు ‘సెంట్రీ’

న్యూయార్క్‌: కృత్రిమ మేధ కట్టుతప్పి ప్రవర్తించకుండా నిరోధించేందుకు తాము సరికొత్త సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు అంతర్జాతీయ కంపెనీ ఎన్‌విడియా సోమవారం ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఏజెంట్‌ సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌లో ఏఐ ఏజెంట్ల కట్టడికి సాఫ్ట్‌వేర్‌తోపాటు కొన్ని సరిహద్దులను కూడా నిర్వచించామని కంపెనీ తెలిపింది.

 ఏఐ మోడళ్లు తమ ప్రమేయం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇతర కంపెనీలను హ్యాక్‌ చేస్తున్నాయని ఓపెన్‌ ఏఐ, ఆంత్రోపిక్, స్పేస్‌ ఎక్స్‌ ఏఐ వంటివి చెబుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఆవిష్కరణకు ప్రాధాన్యమేర్పడింది. 

ఏఐ అదుపు తప్పుతోందని, మానవాళి మనుగడకు ముప్పు కాగలదని, ఇంటర్నెట్‌ మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకోవచ్చునని ఇటీవలి కాలంలో వచి్చన వార్తలు సర్వత్రా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే తాము అభివృద్ధి చేసిన సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌ ఏఐ మోడళ్లు ఇతర కంపెనీలను హ్యాక్‌ చేయకుండా నిరోధించగలవని ఎన్‌విడియా ప్రతినిధి ఒకరు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.

 ఓపెన్‌ ఏఐకి చెందిన ఏఐ మోడళ్లు హగ్గింగ్‌ ఫేస్‌ అనే స్టార్టప్‌ కంపెనీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేయడాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ఓపెన్‌ ఏఐ ఫ్రాంటియల్‌ ల్యాబ్‌లో ముందునుంచే ఈ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ను వాడి ఉంటే అసలు హ్యాకింగ్‌ జరిగి ఉండేదే కాదు’’అని ఎన్‌విడియా వైస్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ బొయిటానో వ్యాఖ్యానించారు. ఏఐ మోడళ్లు అదుపు తప్పుతున్నాయనే విషయాన్ని ప్రపంచానికి మొట్టమొదట తెలియజెప్పిన ఘటన హగ్గింగ్‌ ఫేస్‌ హ్యాకింగే కావడం గమనార్హం.

 ఆ తరువాత ఓపెన్‌ ఏఐతోపాటు ఆంత్రోపిక్, మెటా వంటి ఇతర సంస్థల మోడళ్లు కూడా మనిషి నియంత్రణ నుంచి తప్పించుకుని సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఎన్‌విడియా ఏఐ మోడళ్ల కట్టడికి అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ ‘ఓపెన్‌ షెల్‌’ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ కావడం విశేషం. అంటే.. దీన్ని ఏ డెవలపరైనా వాడుకోవచ్చు. మెరుగుపరచవచ్చు కూడా. 

నిర్దిషమైన పని చేసేందుకు ఏఐ మోడల్‌కు తగిన అనుమతులు ఉన్నాయా? లేదా? అన్నది ఈ సాఫ్ట్‌వేర్‌ పరిశీలిస్తుందని బొయిటానో తెలిపారు. ఏఐ మోడళ్ల కార్యకలాపాలపై నిత్యం ఒక కన్నేసి ఉంచేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌లో ‘సెంట్రీ’పేరుతో ఇంకో భద్రతాపరమైన ఏర్పాటును కూడా సిద్ధం చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఓపెన్‌ షెల్‌ ఏఐ మోడల్‌ చర్యలను పర్యవేక్షిస్తే... సెంట్రీ అనుమానాస్పద కార్యకలాపాలపై స్వతంత్రంగా నిఘా పెడుతుంది’’అని వివరించారు. మైక్రోసాఫ్ట్, పర్‌ప్లెక్సిటీ, ఆక్సెంచర్, జేపీమోర్గన్‌ ఛేస్‌తోపాటు సుమారు వంద కంపెనీలు ఈ సరికొత్త సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ను ఉయోగిస్తున్నట్లు అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement