బ్రిటన్‌లో అమెరికా బాంబర్ విమానాలు ఉపయోగించే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ స్థావరం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన 3 వ్యాన్లను బాంబు నిర్వీర్య బృందాలు పరిశీలించాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై దర్యాప్తు కొనసాగుతోంది.
గ్లౌసెస్టర్‌షైర్ పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి దాటాక 12.45 గంటల సమయంలో ఫెయిర్‌ఫోర్డ్ వైపు 3 అనుమానాస్పద వాహనాలు వెళ్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సాయుధ పోలీసులు రంగంలోకి దిగి విల్‌ఫోర్డ్ ప్రాంతంలో ఐదుగురిని అరెస్టు చేశారు. తొలుత పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం ఉగ్రవాద చర్యకు సిద్ధమైన అనుమానంతో దర్యాప్తును ఉగ్రవాద నిరోధక పోలీసులకు అప్పగించారు.
వాహనాల చుట్టూ 400 మీటర్ల మేర భద్రతా వలయం ఏర్పాటు చేశారు. బ్రిటన్ సైన్యానికి చెందిన పేలుడు పదార్థాల నిర్వీర్య బృందం అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని సుమారు 85 కుటుంబాలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. ఘటనను తక్షణ ప్రమాదం పరిమితమైందని పోలీసులు తెలిపారు.
రంగంలోకి బాంబు నిర్వీర్య రోబో
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో రిమోట్ ద్వారా నడిచే బాంబు నిర్వీర్య రోబో 3 వాహనాల్లో ఒకదాని వద్దకు వెళ్లి సమీపంగా తనిఖీ చేస్తున్నట్లు కనిపించింది. మరో 2 వ్యాన్ల వెనుక తలుపులు తెరిచి ఉండగా, వాటి సమీపంలో పెద్ద నల్లటి వస్తువులు కనిపించాయి.
ఈ ఘటన వెనుక ఉద్దేశం ఏమిటన్నది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనకు-ఇరాన్‌కు సంబంధం ఉండొచ్చన్న కోణానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, రష్యా విధ్వంస చర్య లేదా ఇస్లామిస్ట్ కుట్ర కోణాలనూ పరిశీలిస్తున్నారని దర్యాప్తు విషయాలు తెలిసిన వ్యక్తి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నిందితులు పెద్ద నష్టం చేయాలని చూస్తున్నారని అన్నారు.
ఫెయిర్‌ఫోర్డ్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన 501వ కాంబాట్ సపోర్ట్ విభాగం, 420వ వైమానిక స్థావర విభాగం ఉన్నాయి. ఈ ఘటన తర్వాత బ్రిటన్‌లోని లాకెన్‌హీత్, మిల్డెన్‌హాల్ స్థావరాల వద్ద కూడా భద్రత పెంచారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల ఉద్దేశం, ఘటన వెనుక సంబంధాలు స్పష్టమయ్యే వరకు మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Footage from Britain shows a bomb-disposal robot moving directly toward one of the suspicious vehicles in Whelford, near RAF Fairford, and carrying out a close inspection of the vehicle. The area remains secured while the examination continues. https://t.co/ZkDXPoHzgu pic.twitter.com/VQ27CBJbKr
— DDF NEWS (@ddfmarketing1) September 27, 2026
Aerial footage from RAF Fairford shows B-1B bombers dispersed across the base’s eastern parking slots. Meanwhile, British Army bomb-disposal units continue operating in nearby Whelford following the security incident in the area. https://t.co/B4Xraxaysc pic.twitter.com/8uwVCR5hkf
— DDF NEWS (@ddfmarketing1) September 27, 2026


