కిల్లర్‌ విజయం సాధించాలి | Director Harish Shankar Speech at Trailer Launch Event | Sakshi
Sakshi News home page

కిల్లర్‌ విజయం సాధించాలి

Oct 22 2026 5:45 AM | Updated on Oct 22 2026 5:45 AM

Director Harish Shankar Speech at Trailer Launch Event

– దర్శకుడు హరీష్‌ శంకర్‌ 

‘‘కిల్లర్‌ బడ్జెట్, పని దినాలు, ట్రైలర్‌ని బట్టి చూస్తే క్వాలిటీ సినిమా చేశారనిపించింది. ఈ సినిమాతో పూర్వాజ్‌కి గుర్తింపు, సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ తెలిపారు. పూర్వాజ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్‌’. జ్యోతి పూర్వాజ్‌ హీరోయిన్‌గా, మనీష్‌ గిలాడా, చంద్రకాంత్‌ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్‌ ఇతర పాత్రల్లో నటించారు. 

ఉర్వీశ్‌ పూర్వాజ్‌ సమర్పణలో ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో పూర్వాజ్, పద్మనాభరెడ్డి .ఎ. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి హరీష్‌ శంకర్‌ అతిథిగా హాజరై, ట్రైలర్‌ విడుదల చేశారు. 

‘‘పూర్వాజ్‌ టాలెంట్‌ను నమ్మి ‘కిల్లర్‌’ చేశాను. ఫస్ట్‌ కాపీ చూశాక హ్యాపీగా అనిపించింది’’ అన్నారు పద్మనాభరెడ్డి. ‘‘ఇంటర్నేషనల్‌ స్థాయి సైన్స్‌ ఫిక్షన్, స్క్రీన్‌ ప్లేతో చేసిన చిత్రమిది’’ అని జ్యోతి పూర్వాజ్‌ తెలిపారు. ‘‘2024, 2025, 2026 సంవత్సరాల నేపథ్యంలో మూడు డిఫరెంట్‌ లేయర్స్‌లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది’’ అని పూర్వాజ్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement