breaking news
Director Harish Shankar
-
కథ నచ్చితే ఆ తేడా చూడను: హరీష్ శంకర్
‘‘నాకు సినిమా కథ నచ్చితే భాష, చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా చూడకుండా ప్రమోట్ చేయడానికి ముందుంటాను. ‘జింఖానా’ చిత్రం ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలప్పుజ జింఖానా’. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న మలయాళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘జింఖానా’ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న సుబ్బారెడ్డిగారికి అభినందనలు. నైజాంలో మైత్రీ మూవీస్ శశిగారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తిరుగుండదు’’ అన్నారు. డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నేను చూశాను.. చాలా బాగుంది. స్పోర్ట్స్ కామెడీ నేపథ్యంలో చాలా బాగా తీశారు’’ అని చెప్పారు. ‘‘స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్ ‘జింఖానా’. చాలా మంచి యాక్షన్ సీక్వెన్ ్సలు, పాటలుంటాయి’’ అని ఖలీద్ రెహమాన్ తెలిపారు. హీరో నస్లెన్ మాట్లాడుతూ–‘‘నేను నటించిన ‘ప్రేమలు’ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన స΄ోర్ట్ మర్చి΄ోలేను. ‘జింఖానా’ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ఈ వేడుకలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, డైరెక్టర్స్ సాగర్ కె. చంద్ర, సుజీత్, సందీప్, నటీనటులు బేబీ జీన్, లుక్మాన్ అవరన్, సందీప్ ప్రదీప్ మాట్లాడారు. -
కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు
‘‘భాగ్ సాలే’ సినిమాను నేను నిర్మించాల్సింది.. కానీ కుదరలేదు. శ్రీసింహాలో మంచి టైమింగ్ ఉంది. ఈ సినిమాలో కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు. దర్శకుడు ప్రణీత్‌తో నేను, విష్ణు కలిసి ఓ సినిమాను నిర్మించనున్నాం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీ సింహా మాట్లాడుతూ–‘‘ఈ సినిమాతో అందర్నీ నవ్విస్తాం’’ అన్నారు. ‘‘భాగ్ సాలే’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ప్రణీత్. ‘‘మంచి క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది’’ అన్నారు అర్జున్ దాస్యన్ . ‘‘ఈ తరహా చిత్రాలు చాలా తక్కువగా వస్తాయి’’ అన్నారు యష్ రంగినేని. -
‘డీజే’ పాటలో ఆ పదాలను తొలగిస్తాం
- బ్రాహ్మణ సంఘాలతో దర్శకుడు హరీశ్ శంకర్, కవి సాహితి సాక్షి, హైదరాబాద్ బ్యూరో: వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నఅల్లు అర్జున్ ‘డీజే– దువ్వాడ జగన్నాథం’ సినిమాను దర్శకుడు హరీశ్ శంకరే స్వయంగా గట్టెక్కించారు. సినిమాలోని ఓ పాటలో ప్రయోగించిన ‘నమక చమకాలు’, ‘ప్రవర’, ‘అగ్రహారాల’ అనే పదాలను తొలగిస్తామని ఆ సినిమా దర్శకుడు హరీశ్‌శంకర్, గీత రచయిత సాహితి తెలిపారు. చిత్రంలోని ఓ పాటలో కొన్ని పదాలను ఉపయోగించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సంఘం నేతలు సోమవారం ‘డీజే’ సినిమా దర్శకుడు హరీష్‌శంకర్‌ను, గేయ రచయిత సాహితిని వారి కార్యాలయంలో కలిశారు. ‘నమక, చమకాల’ ప్రాశస్త్యాన్ని వివరించి, ఆ పదాలను తొలగించాలని కోరారు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో పాటను రాయలేదని, పండితుల, బ్రాహ్మణ సంఘాల కోరిక మేరకు వాటిని మారుస్తామన్నారు. పాటలో మార్పుచేర్పులకు అంగీకరించిన దర్శక నిర్మాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ద్రోణంరాజు రవికుమార్, తులసి శ్రీనివాస్, గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, సుబ్బూజీ తదితరులు పాల్గొన్నారు. -
జగన్నాథమ్ స్మైల్!
వందమందికి వంట చేసినా... ఓ అమ్మాయితో లవ్‌లో పడినా... ఒకడికి వార్నింగ్ ఇచ్చినా... కామెడీ చేసినా... ఆ మాటకొస్తే జగన్నాథమ్ఏం చేసినా భలే స్టైల్‌గా ఉంటుంది. డీజే (దువ్వాడ జగన్నాథమ్)గా అల్లు అర్జున్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం స్టైల్ తప్పదు మరి అంటున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. అల్లు అర్జున్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న సినిమా ‘దువ్వాడ జగన్నాథమ్’. ఇటీవల అబుదాబిలో ఓ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ – ‘‘అల్లు అర్జున్ స్టైల్‌కి తగ్గట్టు కమర్షియల్ అంశాలతో పాటు సినిమాలో మంచి వినోదం ఉంటుంది. ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటను తెరకెక్కిస్తున్నాం. సినిమాలో ముఖ్యమైన అంశాలన్నీ హైలైట్ అయ్యేలా శ్రీమణి ఈ పాట రాశారు. బన్నీ డ్యాన్స్, సాంగ్ పిక్చరైజేషన్ అభిమానులకు కన్నుల పండగలా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. జగన్నాథమ్‌గా ఆల్రెడీ విడుదలైన గెటప్‌కి భిన్నమైన మరో గెటప్‌లో బన్నీ కనిపిస్తారని సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కళ: రవీందర్, కూర్పు: ఛోటా కె. ప్రసాద్, కథనం: రమేశ్‌రెడ్డి–దీపక్‌రాజ్, కెమేరా: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
నాది కానిది... నాది అని చెప్పుకోలేను!
డెరైక్టర్ హరీశ్‌శంకర్... ఈ పేరు వినగానే ‘షాక్’ లాంటి వెరైటీ ఫిల్మ్... ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్... ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి అట్టర్‌ఫ్లాప్... ఇలా రకరకాల ఇమేజెస్. కానీ, ఆ ఇమేజ్ లకు లొంగకుండా ఏదైనా ముక్కుసూటిగా, ఇంకా చెప్పాలంటే ముక్కు మీద గుద్దినట్లు చెప్పే ఈ డెరైక్టర్ ఇప్పుడు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంటున్నారు. ఆయనతో ‘సాక్షి’ భేటీ... ♦ మొత్తానికి, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో దర్శకుడిగా మిమ్మల్ని మీరు మళ్ళీ సేల్‌లో పెట్టుకున్నట్లున్నారు! (నవ్వేస్తూ...) ప్రతి సినిమాకూ మనల్ని మనం సేల్‌లో పెట్టుకోవాల్సిందే. ఏ కథకైనా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మనం బెస్ట్ ఇచ్చినట్టు! లేకపోతే ఇవ్వనట్టు! ♦ కానీ, దాదాపు రెండేళ్ళ గ్యాప్ వచ్చిందే! ఏ సినిమాకైనా అంతే కష్టం. ‘గబ్బర్‌సింగ్’కూ రెండేళ్లు తీసుకున్నా.‘రామయ్యా వస్తావయ్యా’కూ ఇలాగే కష్టపడ్డా. తీరా ‘రామయ్యా..’ ఫ్లాప్ అవడంతో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు పట్టిన టైమ్ గురించి ‘సినిమాలు లేవేమో’ అని మాట్లాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యదేశం కాబట్టి వాటిని ఖండించాల్సిన అవసరం లేదు. ♦ ఫ్లాప్ వచ్చాక పెద్ద హీరోలు చాన్స్లి వ్వక, చిన్న హీరోతో చేశారా? అదేమీ లేదు. ‘రామయ్యా’ ఫ్లాపైన వెంటనే, అల్లు అర్జున్ నాకు ఫోన్ చేసి, సినిమా చేద్దామన్నారు. అయితే, మళ్ళీ పెద్ద హీరోతో సినిమా, అందులోనూ ఫ్లాప్‌లో ఉన్న దర్శకుణ్ణి అనగానే దానికి పడే శ్రమ, ఒత్తిడి ఎక్కువ. పైగా, ‘సుబ్రమ ణ్యం ఫర్ సేల్’ కథ ఒక పెద్ద హీరోతో చేసే స్క్రిప్ట్ కాదు. అందుకే, సాయిధరమ్ తేజ్‌తో చేశా. అంతేతప్ప, నాకు అవకాశం ఇవ్వలేదనో, మరొకటనో ఎవరికో ఏదో ప్రూవ్ చేయడానికి కాదు. అలాంటి సీన్లు సినిమాల్లో బాగుంటాయి కానీ, నిజజీవితంలో కుదరదు. ♦ అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథే ఇదన్నారే! అది నిజం కాదు. ఇది ఎప్పుడో రాసుకున్న కథ. కొత్తగా సినిమాలు తీస్తున్న రోజుల్లో నచ్చిన ట్టల్లా కథలు రాసుకుంటూ ఉండేవాడిని. హీరోకు తగ్గట్టు కథలు రాసేంత లౌక్యం అప్పట్లో లేదు. ఎవరికి నచ్చుతుందా అని తిరిగేవాణ్ణి. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘మిరపకాయ్’ తర్వాత చేయాల్సిన సినిమా ఇది. తర్వాత ‘గబ్బర్‌సింగ్’, ‘రామయ్యా...’ చేయడంతో ఇది తీయడం ఇప్పటికి కుదిరింది. ♦ ఈ సినిమాకూ, ‘మొగుడు కావాలి’కీ పోలికలుంటాయని బయట ప్రచారం! ‘మిస్సమ్మ’, ‘మొగుడు కావాలి’, ‘బావగారూ! బాగున్నారా’ - ఇలా చాలా సినిమాల్లో హీరో ఓ హీరోయిన్ కథలోకి ఎంటర వుతాడు. ఇలా చాలా సినిమాల్లోని ప్యాట్రన్‌లోనే ఇదీ ఉంటుంది. ♦ ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్త్వం ఎవరి దగ్గర నేర్చారు? మా నాన్నగారు తెలుగు మాస్టారు. ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయన చాలా హైపర్. విపరీతమైన వ్యంగ్యం! నాకు చిన్నతనం నుంచి ఎండలోకెళితే, ముక్కు వెంట రక్తం కారేది. అందుకే ఇంట్లోనే ఉంచి, లైబ్రరీ అంతా చదివించేశారు. నేనీ స్థాయిలో ఉన్నానంటే నాన్నగారే కారణం. ♦ ఫాదర్ సెంటిమెంట్ మీద సినిమా తీయాలనినిపించిందా? ఏదైనా కథ డిమాండ్ చేయాలి. ఏ హీరోకి ఏ కథ సూట్ అవుతుందా అని ఆలోచించి రాసు కోవాలి. నేను అద్భుతమైన కథలు రాయడం కన్నా, అందరికీ అర్థమయ్యే కథలు రాయాలనుకుంటా. ♦ ‘గబ్బర్‌సింగ్’ టైమ్‌లో డైలాగ్స్ ఎవరో రాశారన్న వార్తలు వచ్చాయి. అవి నిజమేనా? గబ్బర్‌సింగ్‌లో ప్రతి అక్షరం నేను రాసుకున్నదే. ఒక్క బ్రహ్మానందం గారి డైలాగ్ ‘‘నేను ఆయుధాలతో చంపను, వాయిదాలతో చంపుతా’’ అనేది మా కోడెరైక్టర్ కృష్ణారెడ్డి సజెస్ట్ చేశారు. దాంతో అతని పేరు రచనా సహకారం అని వేశా. నాది కాని దాన్ని నాది చెప్పుకోవడానికి ఇష్టపడను. ఘోస్ట్ రైటర్‌గా నాకెవరూ క్రెడిట్ ఇవ్వలేదని ఏడ్చేసిన రాత్రుళ్ళు చాలానే. ♦ అంత హిట్టిచ్చినా ‘గబ్బర్‌సింగ్ ’ సీక్వెలెందుకు చేయట్లేదు? ‘గబ్బర్‌సింగ్ ’ ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్. కానీ ‘గబ్బర్ సింగ్-2’కు మాత్రం ముందు సినిమాను దృష్టిలో పెట్టుకుని వస్తారు. మళ్లీ అద్భుతం రిపీట్ అవుతుందో లేదో చెప్పలేం. సో... ప్రెషర్ చాలా ఉంటుంది. పైగా ఫస్ట్ టైమ్ కాబట్టి దర్శకుడు బాబీ నా కన్నా ఫ్రెష్‌గా డీల్ చేస్తాడు. ఒకసారి దర్శనం అయిపోయాక. మళ్లీ లైన్లో నిల్చొని దర్శనం కావాలనుకోవడం స్వార్థం అవుతుంది. ♦ పవన్‌కల్యాణ్‌కూ, మీకూ మధ్య విభేదాలు వచ్చాయని... అందులో నిజం లేదు. నేను ఆయనను ఇష్టపడే వ్యక్తిని. విభేదాలు పెట్టుకునే స్థాయి, అర్హత నాకు లేవు. ♦ మీ షార్ట్ టెంపర్‌తో ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చాలా చేశా. వాటిని అధిగమించడమేగా జీవితం. ♦ ఈ సినిమాలో హీరోయిన్‌తో ఇంటిమేట్ సీన్లున్నాయని.. (నవ్వేస్తూ...) అన్ని సీన్స్ ఉంటే ‘ఎ’ సర్టిఫికేట్ వచ్చేది. కానీ యు/ఎ వచ్చింది. అదీ ఫైట్స్ వల్లే. రొమాంటిక్ సీన్స్ కూడా అంతా చూసేలా ఉంటాయి. ♦ చిరంజీవి సాంగ్ ‘గువ్వా గోరింకతో...’ రీమిక్స్ గురించి? ప్రతి సినిమాలో ఇంటర్వెల్ ముందు హుషారైన పాట ఉండాలనుకుంటా. ‘మిరపకాయ్’లో ‘చిలకా...’, ‘గబ్బర్‌సింగ్’లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఉంటాయి. ఈ సినిమాలో ‘యాష్ కరేంగే...’ పాట పెట్టా. సెకడాంఫ్‌లో వచ్చే పాటకి ఈ రీమిక్స్ వాడాం. ♦ ఇలా లెక్కలేసుకొని తీస్తే హిట్ ఫార్ములానా? పాట పెట్టాలనేది నా ప్యాట్రనే తప్ప ఫార్ములా కాదు. సక్సెస్ ఫార్ములా తెలిస్తే, అన్నీ హిట్టవుతాయిగా. ఏమైనా, ఇది హీరో బేస్డ్ ఇండస్ట్రీ. ♦ మీలాంటి కొంత మంది డైరక్టర్ బేస్డ్ ఇండస్ట్రీగా మార్చారు కదా? లేదండి. ‘రామయ్య...’ ఫ్లాప్ తర్వాత హరీశ్‌కు సినిమాలు ఎవరిస్తారని అన్నారే గానీ ఎన్టీఆర్‌కు ఎవరిస్తారు అని అనుకున్నారా? ఫ్లాప్ అయినప్పుడు డైరక్టర్లదే ఫాల్ట్ గానీ హీరోలది కాదు. హీరో వంద మందిని నరికితే కానీ, 80 ఏళ్ళ ఇండస్ట్రీ బ్లాక్బస్టరివ్వని ఆడియన్స్ అభిరుచి మేరకే సినిమా తీయాలి. మాది వాళ్ళ మీద రుద్దకూడదు. నచ్చిన పనే చేస్తున్నా, రాజీ పడక తప్పదు. డైరక్టర్ శంకర్‌ని ‘ఎప్పుడైనా రాజీపడ్డారా’ అంటే, ‘రోబోకు మరో 30 కోట్లు బడ్జెట్ ఉంటే ఇంకో లెవల్‌కు తీసుకెళ్లేవాడి’నన్నారు. ♦ మీ తాజా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ మీద కానీ, మీ ఇతర చిత్రాల మీద కానీ ఉన్న ప్రభావం? ‘అయామ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్’ అని ఇంగ్లీషు మాట. అలాగే నేను చూసిన చాలా సినిమాలు, చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తుల ప్రభావం నా సినిమాలపై ఉంది. ♦ మరి, మీ ఆలోచనా విధానం మీద ఎవరి ప్రభావం ఉంటుంది? యండమూరి, షారుక్‌ఖాన్, రవితేజల ప్రభావం ఉంటుంది. షారుక్ ఎనర్జీ అంటే ఇష్టం. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ నుంచి చలం, మల్లాది - అందరి పుస్తకాలూ చదివాను. ♦ మళ్ళీ చిన్న ఎన్టీయార్‌తో సినిమా ఛాన్స్ వస్తే...? ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు చేస్తా. అలాంటి పెద్ద హీరో ఇచ్చిన అవకాశాన్ని ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో సరిగ్గా వాడుకోలేకపోయాననే బాధ నాలో ఉంది. ♦ ఇంతకీ ఆ సినిమా ఎందుకు ఆడలేదంటారు? చాలా కారణాలే ఉన్నాయి. కానీ, ఆ ఫెయిల్యూర్‌కి బాధ్యత నాదే. సక్సెస్ నుంచి నేర్చుకోకపోయినా ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాలిగా! -
సుబ్రమణ్యం ఫర్ సేల్
సుబ్రమణ్యాన్ని అమ్మకానికి పెట్టారట! సుబ్రమణ్యం అంటే కత్తి లాంటి కుర్రాడు. తిమ్మిని బమ్మిని చేయగల తెలివైనోడు. అలాంటివాణ్ణి ఎందుకు సేల్కు పెట్టారో తెలియాలంటే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. చురుకైన, పదునైన హీరోయిజాన్ని ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో హరీశ్‌శంకర్ స్పెషలిస్టు. ఇక కథను కరెక్టుగా జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రం మీద సాయిధరమ్‌తేజ్, రెజీనా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.