breaking news
simple
-
శ్వాస మరింత మెరుగ్గా! సింపుల్ అండ్ హెల్దీ యోగ!
శరీరం, మనస్సును సమన్వయం చేయడంలో శ్వాస కీలక పాత్ర పోషిస్తుంది. యోగా ద్వారా శ్వాసలోని లోపాలు, ఒత్తిడి, నిరాశ లను అదుపు చేయవచ్చు. మానసిక స్థిర త్వాన్ని మెరుగ పరచుకోవచ్చు.శ్వాస వ్యాయామాలు...ఉజ్జయి శ్వాసను సముద్ర శ్వాస పద్ధతితో పోల్చుతారు. ముక్కు ద్వారా దీర్ఘంగా గాలి పీల్చి, ముక్కు ద్వారా వదలడం. దీనిని సాధారణంగా అష్టాంగ, విన్యాస తరగతులలో ఉపయోగిస్తారు. మూడుభాగాల శ్వాసగా పిలిచే ఈ పద్ధతిలో బొడ్డు, ఛాతీ, దిగువ వీపును గాలితో నింపి, ఆపై రివర్స్ క్రమంలో ఉచ్ఛ్వాసం చేయడం జరుగుతుంది. ఇది విశ్రాంతిని, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మెరుగైన దృష్టిని ప్రోత్సహిస్తుంది.నాలుకను గొట్టం మాదిరి ముడిచి, వంకరగా ఉంచుతూ నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం, ఆపై ముక్కు ద్వారా ఊపిరి పీల్చడాన్ని సితాలి శ్వాస అంటారు. భ్రమరి శ్వాస ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. చూపుడు వేలును ముక్కుపైన ఉంచాలి. ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు తేనెటీగ లాగా హమ్ చేయాలి.చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో కపాలభాతి శ్వాసను ‘బ్రెయిన్ మెరిసే శ్వాస’ అని కూడా పిలుస్తారు. ఇది చిన్న, శక్తివంతమైన ఉచ్ఛ్వాసాలపై దృష్టి పెడుతుంది. దీర్ఘంగా శ్వాస పీల్చుకుని, ఆపై ముక్కు ద్వారా 15–30 సార్లు గాలిని వదలాలి. చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంనాడి శోధన శ్వాసను ‘ప్రత్యామ్నాయ నాసికా ప్రాణాయామం’ అని కూడా అంటారు. ఒక ముక్కు రంధ్రాన్ని మూసి, మరొకదాని ద్వారా శ్వాస తీసుకొని, వదలాలి. ఈ వివిధ యోగా శ్వాస పద్ధతులను సాధన చేయడం వల్ల శారీరక, మానసిక శ్రేయస్సు బాగా పెరుగుతుంది. -
సింపుల్ అండ్ గ్రేస్‌ఫుల్..!
‘డ్రెస్‌ని ఖరీదుతో చూడకూడదు. ఆ డ్రెస్ కలర్, ఫిటింగ్ మనకు ఎంత బాగా నప్పాయి... అనేవి చెక్ చేసుకొని తీసుకోవాలి’ అంటున్నారు హైదరాబాద్‌లోని భరత్‌నగర్ వాసి రాధ పర్వతరెడ్డి. తక్కువ బడ్జెట్లో డ్రెస్ డిజైనింగ్‌ని స్పెషల్‌గా, కంఫర్ట్‌గా, క్రియేటివ్‌గా ఎలా ప్లాన్న్ చేసుకుంటున్నారో వివరిస్తున్నారు.‘‘ఎంత సింపుల్‌గా రెడీ అయితే అంత గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాం. అందుకే నా వార్డ్ రోబ్‌లో ప్లెయిన్ శారీస్‌కు ఎక్కువ చోటు ఉంటుంది. ప్లెయిన్ సిల్క్ శారీస్ జాబితా ఎక్కువే ఉంటుంది. వాటిలోనూ లైట్ కలర్స్వే తీసుకుంటాను. వీటికి కాంట్రాస్ట్ కలర్లో ఉన్న కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేస్తాను. పొడవుగా ఉన్నవారికి ఈ కాంబినేషన్ చీరలు బాగుంటాయి. గెట్ టు గెదర్ పార్టీలకు ఈ స్టైల్ బాగా నప్పుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకునే సదుపాయం ఉంది. యూ ట్యూబర్ని కాబట్టి స్పెషల్ లుక్స్ కోసం ట్రై చేస్తుంటాను. ఈ కాంబినేషన్‌కి హెయిర్ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. నా జుట్టు పొడవుగా ఉంటుంది. శారీ కట్టుకుంటే మాత్రం జుట్టుకి ఒక చిన్న క్లిప్ పెట్టుకొని, మిగతా హెయిర్ అంతా లీవ్ చేస్తుంటాను. జుట్టు బాగుంటే డ్రెస్సింగ్ కూడా బాగుంటుంది కాబట్టి, హెయిర్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. చందేరీ స్పెషల్దుపట్టా పెద్దగా ఉండే చుడీదార్స్ అంటే ఇష్టం. వీటిలోనూ లైట్ కలర్స్కే పప్రాధాన్యత. రెడీ టు వేర్ ఉండే డ్రెస్సులు ఈ జాబితాలో ఉంటాయి. పండగల సమయాల్లో అయితే చందేరీ శారీస్ ఎంచుకుంటాను. చందేరీ చీరల రంగులు బాగుంటాయి. చూడటానికి ప్రత్యేకంగానూ ఉంటాయి. ఏ సంప్రదాయ వేడుకల్లోనైనా ఈ చీరలు బాగుంటాయి. బ్లౌజ్‌కి కొంచెం డిజైన్ ఉన్నా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నేను వీటికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్లనే మ్యాచ్ చేసుకుంటాను. చందేరీ చీరల్లో బ్రైట్ రెడ్, గ్రీన్ కలర్స్ ఎంచుకుంటాను. పెళ్లి వేడుకల్లో పట్టు చీరలు, లెహంగాలు ఎంచుకుంటాను. లెహంగాకు మ్యాచ్ చేయడానికి కొంచెం స్టైల్స్‌లో మార్పుకు క్రాప్‌టాప్స్, మ్యాచింగ్ దుపట్టాలు సెలెక్ట్ చేసుకుంటాను.ప్రింటెడ్ బ్లౌజులుబ్లౌజ్ డిజైన్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అనే విషయానికి చాలా దూరంగా ఉంటాను. ప్రింటెడ్ కాటన్ మెటీరియల్స్ చాలా రకాల డిజైన్లలో మార్కెట్లో లభిస్తున్నాయి. వీటితో శారీ లుక్ స్పెషల్ అనిపించేలా డిజైన్ చేయిస్తాను. షార్ట్ స్లీవ్స్, స్ట్రాప్స్ .. యంగ్ లుక్‌ని మరింత ఎలివేట్ చేస్తాయి.సౌకర్యమే ఫస్ట్... టూర్స్‌కి వెళ్లినప్పుడు సౌకర్యానికే పప్రాధాన్యత. గంటల సమయాన్ని ప్రయాణంలోనే గడపాలి. అందుకని జీన్స్‌కు బదులు జెగ్గింగ్స్, టీ షర్ట్స్, నైట్ డ్రెస్‌లకే ఓటు వేస్తాను. ఎక్కువ లైట్ కలర్స్‌కి పప్రాముఖ్యం ఇచ్చినా నాకు ఇష్టమైన కలర్ మాత్రం బ్లాక్. లైట్–బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు నా వద్ద చాలానే ఉన్నాయి’’ అంటూ తన డ్రెస్ సెలక్షన్, కలెక్షన్ గురించి వివరించారు రాధ. (చదవండి: బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నారా..? స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్న నిపుణులు) -
'తొలిప్రేమ' వాసుకి పుట్టినరోజు.. భర్తతో సింపుల్‌గా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కదిలే ఇళ్లు.. ఆసక్తికర ఫొటోలు
-
వందలాది ఉద్యోగుల తొలగింపు.. సారీ చెప్పిన సీఈవో
ఫిన్‌టెక్ కంపెనీ సింపుల్ (Simpl) వివిధ విభాగాల్లో వందలాది ఉద్యోగులను తొలగించింది. యూజర్ల చేరిక మందగించడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో 15 శాతం దాదాపు 100 మందిని కంపెనీ వదిలించుకుంది. కోతల ప్రభావం ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో అత్యధిక జీతాలు అందుకునే ఉద్యోగులపై పడినట్లు తెలుస్తోంది.తాజా తొలగింపులకు ముందు, సింపుల్ దాదాపు 650 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో ప్రధాన కార్యకలాపాలు, ఇంటర్న్లు, కాల్ సెంటర్ ఏజెంట్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌లో ఇవి వరుసగా రెండవ సంవత్సరం తొలగింపులు. 2023 మార్చిలో సింపుల్ దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ తొలగింపుల్లో కొంతమంది ఇటీవలే చేరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగంలో చేరి ఒకటి లేదా ఒకటిన్నర నెలలు మాత్రమే కావడం గమనార్హం.కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో నిత్యానంద్ శర్మ బుధవారం టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. లేఆఫ్‌ల నిర్ణయానికి విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయంతో సహా ప్రభావితమైన వారికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. -
స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు!
కావలసినవి: చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించుకుని, తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి) ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) కొబ్బరి తురుము – అర కప్పు కారం – అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు – 1 టీ స్పూన్ జీలకర్ర పొడి – అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్ గోధుమ పిండి – 2 కప్పులు పంచదార – 2 టేబుల్ స్పూన్లు నూనె, గోరువెచ్చని నీళ్లు – కొద్దికొద్దిగా ఉప్పు – తగినంత నువ్వులు – కొద్దిగా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ పెట్టుకుని.. 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, చిలగడదుంపల ముక్కలు, కొబ్బరి తురుము, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ.. బాగా వేయించాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. అప్పడాల్లా ఒత్తి.. అందులో చిలగడదుంపల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి.. తిరిగి మళ్లీ బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం వాటిపైన నువ్వులు అద్ది.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఇవి చదవండి: ఈ స్టీమర్ కుకింగ్ ఎలక్ట్రికల్ పాట్.. గురించి విన్నారా..! -
ఈ క్రిస్మస్కి సింపుల్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ ఏవో తెలుసా..!?
'మరికొద్దిరోజుల్లో జరుపుకోనున్న క్రిస్మస్కు దాదాపు ప్రపంచమంతా ఆతృతగా రెడీ అయి΄ోతోంది. షాపింగ్ మాల్స్ నుంచి క్రిస్టియన్ లోగిళ్లు, చర్చ్‌లు.. క్రిస్మస్ స్టార్లు, ట్రీల అలంకరణతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. వీటితో΄ాటు తప్పనిసరిగా సందడి చేసేవి శాంతాక్లాజ్ ఇచ్చే బహుమతులు. శాంతాక్లాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కోసం పిల్లలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పిల్లలేగాక, కొన్ని కంపెనీలు సైతం ఉద్యోగులకు, కొంతమంది బంధువులకు, స్నేహితులకు, సహోద్యోగులకు సర్ప్రైజ్గిప్ట్స్ను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి క్రిస్మస్కు తక్కువ బడ్జెట్లో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా నిలిచే బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..' మొక్కలు పర్యావరణం పచ్చగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే పర్యావరణ స్నేహితం అయిన పచ్చని మొక్కలను క్రిస్మస్కు బహుమతిగా ఇవ్వొచ్చు. ఇప్పుడున్న ఇరుకు ఇళ్లకు ఇండోర్ ΄్లాంట్స్ అయితే మరింత మంచి గిఫ్ట్ అవుతాయి. గిఫ్ట్‌కార్డ్స్, స్పా వోచర్స్ మార్కెట్లో రకరకాల ఫ్యాషన్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏవైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. స్పా వోచర్స్ కూడా మంచి గిఫ్ట్సే. మ్యాచింగ్ పీజేఎస్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నప్పేలా మ్యాచింగ్ క్రిస్మస్ పైజమాలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి ప్రత్యేకంగానూ, ఫన్నీగా ఉండి పండుగ సందడిని మరింత పెంచుతాయి. బుక్స్.. మార్కెట్లో ΄ాపులర్గానూ, బాగా సేల్ అవుతున్న నవలలు, క్లాసిక్ సాహిత్యం, ప్రేరణ కలిగించే పుస్తకాలు, ఆర్ట్, ఫొటోగ్రఫీ, ట్రావెల్‌కు సంబంధించిన కాఫీ టేబుల్ బుక్స్కూడా మంచి బహుమతులు. ఈ గిఫ్ట్ ఎక్కువకాలం నిలిచి ఉంటుంది. పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఇమిటేషన్ జ్యూవెలరీ, ట్రెండీ అండ్ స్టైలిష్ ఫ్యాషన్ యాక్సరీస్ (వాచ్‌లు, సన్‌గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్), ఫొటో ఆల్బమ్స్, ఫ్రేమ్స్ కూడా క్రిస్మస్ గిఫ్ట్‌గా పనికొస్తాయి. ఇవి పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. సెల్ఫ్‌కేర్ చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎక్కువమంది వింటర్లో చర్మాన్ని కోమలంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కాబట్టి వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తుల సెట్స్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇవేగాక..సెంటెడ్ క్యాండిల్స్, ఫేస్‌మాస్క్‌లు, స్లీపింగ్ మాస్కులు, బాతింగ్ కిట్స్ మంచి గిఫ్ట్స్. పెర్ఫ్యూమ్స్.. పెర్ఫ్యూమ్స్ క్లాసిక్గానూ, అందుబాటు ధరలో దొరికే గిఫ్ట్ ఐటమ్స్. పెర్ఫ్యూమ్ వాడిన ప్రతిసారి .. ఆ సువాసన భరిత పరిమళాలు మీ గిఫ్ట్‌తో΄ాటు మిమ్మల్ని, మీ అభిమానాన్ని గుర్తుచేస్తాయి. మ్యూజిక్ బాక్స్ చార్మింగ్ లిటిల్ మ్యూజిక్ బాక్స్ కూడా ప్రత్యేకంగానూ ఫన్నీగా ఉంటుంది. ఇది కూడా క్రిస్మస్కు మంచి గిఫ్ట్. దీనినుంచి వచ్చే సంగీతం మనసుని ఆహ్లాద పరుస్తుంది. అందమైన మగ్స్ ఉద్యోగులకు లేదా కొలీగ్స్‌కు అందంగా ఉండే మగ్స్ మంచి గిఫ్ట్ ఐడియా. ఈ మగ్స్లో స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడం లేదా, ఇష్టమైన కాఫీ తాగడం లేదా తరచూ వాడే ఐటమ్స్, అందమైన వస్తువులను పెట్టుకుంటారు. ఇవి తక్కువ ధరలో మంచి మంచి డిజైన్స్‌లో కూడా దొరుకుతాయి. ఎయిర్ ప్యూరిఫైర్.. ఎంతవేగంగా అభివృద్ధి చెందుతున్నామో అంతేస్పీడుగా గాలి కలుషితమై΄ోతున్న ఈ రోజుల్లో.. ఎయిర్ ప్యూరిఫయర్స్, ఫిల్టర్స్ అవసరంగా మారి΄ోతున్నాయి. అందుకే మినీ ప్యూరిఫయర్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. వీటిద్వారా మీ సన్నిహితులకు మంచి ఆక్సిజెన్‌ను అందించిన వారవుతారు. డెకరేషన్ ఐటమ్స్ అలంకరించేకొద్దీ ఇంటి అందం పెరగడంతో΄ాటు.. కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాఫీ, టీసెట్స్, కుకింగ్ గాడ్జెట్స్, కిచెన్ టూల్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఆర్ట్ వర్క్ హోం డెకరేటివ్ ఐటమ్స్ కూడా మంచి గిఫ్ట్స్. చిన్న పరిమాణం నుంచి పెద్దసైజులో ఎంతో ఆకర్షణీయమైన, ఉపయోగకరమైనవి అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. క్రాఫ్ట్స్ మేకింగ్ కిట్స్ జ్యూవెలరీ తయారీ, క్యాండిల్ తయారీ, సబ్బుల తయారీ కిట్స్, వెరైటీ దియా మేకింగ్ కిట్స్, ΄్లాంట్ టెర్రారియం, గార్డెనింగ్ సెట్స్ కూడా మంచి బహుమతులే. వీటిలో ఏది బహుమతిగా ఇచ్చినా మీరు మీ ఆత్మీయుల సంతోషాన్ని చూరగొంటారు. ఇవి కూడా చదవండి: ప్రపంచ చీరల దినోత్సవం! 'చీర' అందమే అందం! -
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
దిక్కుల దివ్యగీతాలకు వారసులు, లోకపు భాగ్య విధాతలు పిల్లలు. పాపం పుణ్యం తెలియని ఈ పాపలకు ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’ గురించి పిల్లలకు సింపుల్ లాంగ్వేజ్‌లో, సులభంగా అర్థమయ్యేలా ఒక టీచర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్’ ‘ఈ వీడియోను ప్రతి స్కూల్లో పిల్లలకు చూపించాలి’... అంటూ నెటిజెన్స్ స్పందించారు. రోషన్ రాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
నా పేరు జోన్ జండాయ్; అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..
నేను నా జీవితంలో పొందే అతి కొన్ని చిరాకులతో పాటు అత్యంత ఎక్కువ సంతోషాన్ని ఎప్పుడూ పొందుతూనే ఉన్నాను. నిన్నటి నా జీవితం నాకు జోన్ జండాయ్ ని బహుమతిని చేసింది. తెలుసుకున్న కొద్ది జీవితాన్నిమరింత సంతోషంలో ముంచెత్తే సాధారణ జీవన దూత ఈయన. జోన్ జండాయ్ ఒక రైతు, థాయ్‌లాండ్‌లో కెల్లా అత్యంత సంతోషకరమైన వ్యక్తి గా ప్రపంచం ఈయనను తెలుసుకుంది. జోన్ జండాయ్ థాయ్‌లాండ్‌లోని యాసోథార్న్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన వ్యవసాయం చేస్తారు. ఇంకా మట్టి గృహాలను నిర్మిస్తారు. 2003 లో పన్ పన్ అనే విత్తన సంరక్షణ సంస్థను స్థాపించారు. జోన్ జోండాయ్ చేసిన ఒక ప్రసంగ పాఠాన్ని విని ఎంత సంతోష పడ్డానో మాటల్లో చెప్పలేక ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకోడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ వ్యాస రూపం. - అన్వర్ జీవితంలో నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది, ఎప్పటికి చెప్పగలిగేది ఒకే ఒక మాట ఉంది. అది ఏమిటంటే " Life Is Simple". అవును జీవితం అత్యంత సులభమైనది, సరదా అయినది. "జీవితం సులభం" అనే సులభతరమైన విషయం తెలుసుకోవడం మాత్రం నాకు అంత సులభంగా జరగలేదు. నేను ఇంతకు మునుపు బ్యాంకాక్‌లో ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు నా జీవితం చాలా కష్టంగా, చాలా చాలా సంక్లిష్టంగా ఉండేది. "జీవితం సులభం" అనే విషయం గురించి నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించడానికి సమయం కూడా నాకు అప్పుడు లేదు. నా పేరు జోన్ జండాయ్. నేను ఈశాన్య థాయ్‌లాండ్ ప్రాంతంలోని ఒక చిన్నగ్రామంలో జన్మించాను. నా చిన్నప్పుడు మా ఊరు, ఆ వాతావరణం, గాలి, మాట, వెలుతురు, పలకరింపు.. ప్రతీది సరదాగా, సులభంగా ఉండేది. అప్పుడు జీవితం సహజంగా ఉండేది కాబట్టి జీవితం అనేది సులభం అనే ఎరుక నాకు అప్పుడు లేదు. అత్యంత సహజమైన మానవ జీవితపు లక్షణాలు ఎప్పుడు ప్రత్యేక ఎరుక అయి ఉండవు కదా. ఒక రోజు మా ఊరికి టెలివిజన్ వచ్చింది. ఆ టీవి తో పాటు దానికి తీసుకు వచ్చిన పట్నవాసపు మనుషులూ వచ్చారు. ఆ యంత్రం, దానిని నడిపేవారు ఇద్దరూ కలిసి మాకు మునుపు తెలియని, ఆలోచించని, అసలు ఆ జ్ఞానమే లేని ఒక కొత్త మాట మాకు నేర్పారు "ఒరే! నాయనా మీరు మీరు కడు పేదవారు, కటిక దరిద్రులు. మీ జీవితాంతం వరకు మీరు ఇలా దరిద్రపు గొట్టుగా ఉండనక్కర లేదు. మీరు మేల్కోవాలి. మీ జీవితంలో విజయాన్ని వెంబడించాలి, విజయం యొక్క అయిదు మెట్లు ఎక్కాలి. ఆ అయిదు మెట్లు ఎక్కడానికి మీరు బ్యాంకాక్ వెళ్లాలి" అని చెప్పారు. (నేను మా నూనెపల్లె నుండి హైద్రాబాద్ వరకు దేకినట్లు అన్నమాట) కాబట్టి నేను బ్యాంకాగ్ వచ్చాను, నేను కడు దరిద్రుడిని అని తెలుసుకోడం నాకు ఎంతో చెడుగా అనిపించింది. నేను కటిక పేదరికం వాడిని అని తెలుసుకోడం నా మనసుకు భరించరాని కష్టం వేసింది. కాబట్టి ఎట్టి పరిస్తితుల్లో నేను బ్యాంకాక్‌కు వెళ్లాలి విజయం సాధించాలి. నేను బ్యాంకాక్‌కి వెళ్ళాలని నిర్ణయించుకోవడం.. అక్కడికి చేరుకోవడం అప్పుడు నాకు చాలా గొప్పగా, గర్వంగా ఉండిది. మనం చాలా నేర్చుకోవాలి, గొప్ప చదువు చదువుకోవాలి మరియు చాలా కష్టపడాలి. అలా చేస్తూ ఉంటే ఆ పై మీరు విజయం సాధించవచ్చు అనే మాటలు పదే పదే నా చెవుల్లో ధరించిన నిత్య మంత్రాలు అయ్యాయి. అందుకని నేను చాలా కష్టపడటం ప్రారంభించాను. రోజుకు ఎనిమిది గంటలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేవాన్ని. అంత కష్టపడి పని చేసి చివరికి నేను భోజనానికి సంపాదించుకున్నది కేవలం ఒక కప్పు నూడుల్స్ మాత్రమే. లేదా గిన్నెడు ఫ్రైడ్ రైస్. ఇంకా బ్యాంకాగ్ లో నేను నివసించిన గది ఎలా ఉండేది అనుకున్నారు! అది చాల చెడ్డగా ఉండేది. మహా మురిగ్గా ఉండేది. భరించలేనంత వేడిగా ఉండేది . ఆ వేడితో పాటు నాతో పాటు ఆ గది పంచుకుని ఉన్న చాలా మంది ఊపిరి వేడి . ఇటువంటి పరిస్తితుల మధ్య నేను ఇంకా చాలా తీవ్రంగా కష్టపడటం మొదలుపెట్టాను. నాకు అప్పుడు ఓ అనుమానం కలిగింది. కష్టపడి పని చేయడం అనే సూత్రం వెనుక ఏదో తేడా ఉందని నాకు అనిపిచింది. నేను ఇంత కష్టపడి పనిచేస్తూ పోతున్న కొద్దీ నా జీవితం సులువు కావాలి కదా! కానీ ఇంకా ఎందుకు కష్టతరమవుతుంది? గిన్నెడు అన్నం, కాళ్ళు చాపుకోడానికి తగినంత స్థలం లేని గది ప్రాప్తం అవుతుంది ఎందుకని? కాబట్టి ఎక్కడో ఏదో తప్పుగా ఉండాలి. ఎందుకంటే నేను కష్టపడి పని చేసి చాలా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను కానీ నేను వాటిని నా వినియోగం కోసం పొందలేను. నేను సంపాదించే డబ్బుతో అవేమి కొనగలిగే శక్తి నాకు సమకూరడం లేదు. ఒక్క వళ్ళు వంచి పని చెయ్యడమే కాదు, నేను బుర్రా ఉపయోగించి చదువు, జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. విద్యని అధ్యయనం చేయడానికి ప్రయత్నించాను. నేను యూనివర్సిటీలో చదువుకోవడానికి బయలుదేరాను. కానీ యూనివర్సిటీలో నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చదువుకోవడం అనే పనిని విద్యాలయాలు చాలా బోరింగ్ చేసి పెట్టాయి. నేను ఇక్కడ ఈ చదువుల భవనాల్లోని ప్రతి అధ్యాపకుడిలోను, వారు విశ్వవిద్యాలయంలో బోధించే విషయాలను చూసినప్పుడు, వారిలో చాలామందికి ఉన్నదంతా విధ్వంసక జ్ఞానం. నాకు యూనివర్సిటీలో ఉత్పాదక జ్ఞానం అసలు దొరకలేదు. ఒక ఆర్కిటెక్చర్ లేదా ఇంజినీర్ కావడం అంటే అర్థం ఏమిటంటే.. మీరు ఈ భూమిని, ఈ సహజ సంపదని మరింత, వీలయినంత మరింత ఎక్కువ నాశనం చేసేవారిగా తయారు కావడం. ఈ విధ్వంసక వాస్తువేత్త వ్యక్తులు ఎంత ఎక్కువ తయారు అయితే వారు అంత ఎక్కువ పనిచేసి ఈ భూమి మీది, పర్వతాలు, నదులు, అడవులు మరింత నాశనం చేయడమే అన్నమాటే. ఈ పచ్చదనాన్ని, ఈ సహజ వర్ణాలని తమ బూడిదరంగు మెదడుల న్నుండి బయటికి తీసిన జ్ఞానంతో కొలతలు వేసి ఈ ప్రపంచమంతా కాంక్రీట్ నింపడం. కనుచూపు మేర అంతా బూడిద రంగు, బూడిద రంగు బిల్డింగులు, బూడిద రంగు రోడ్లు, బూడిదరంగు ఆకాశం, బూడిద రంగు జ్ఞానం.. భూమికి బూడిద రంగు కట్టడపు పన్ను, చెరువులోని నీటికి ఇంటి ట్యాంకర్ లలో బంధించిన పన్ను. వ్యవసాయానికి పురుగు మందుల విషపు పన్ను. జీవితం చాలా కష్టంగా ఉంది నేను నిరాశకు గురయ్యాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, నేను అసలు బ్యాంకాక్‌లో ఎందుకు ఉండాలి? నా చిన్నప్పుడు మా పల్లెలో ఎవరూ రోజుకి ఎనిమిది గంటలు పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ప్రతి ఒక్కరూ రోజుకు రెండు గంటలు, సంవత్సరానికి కేవలం రెండు నెలలు పనిచేశారు, ఒక నెలలో వరినాట్లు నాటడం, మరో నెలలో వరి కోయడం అనేదే పని. మిగిలినది అంతా ఖాళీ సమయం, పది నెలల ఖాళీ సమయం. అందుకే మా థాయ్‌లాండ్‌లో ప్రజలు చాలా పండుగలను కలిగి ఉన్నారు. ప్రతి నెలా మాకు ఒక పండుగ ఉంటుంది. ఎందుకంటే జీవితం గడపడానికి, జీవితాన్ని పండగ చేసుకొడానికి అక్కడ చాలా ఖాళీ సమయం ఉంది. జీవితం పండగ కావడం కన్నా జీవితం మరింకేం కోరుకుంటుంది? అక్కడ రాత్రి పూటే కాదు మధ్యాహ్నపు భోజనం ముగించి ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోతారు. (మా నూనెపల్లెలో వర్షాలు పడే రాత్రిళ్ళు తప్పనిస్తే, మేము ఎప్పుడూ ఇంటి గోడల మధ్యనో, తడికల మధ్యనో నిద్ర పోయిందే లేదు. నిద్ర అంటే అంతా మా ఊరి రోడ్ల మీదే, రాత్రుల్లు మా ఊరి దారులన్ని మంచాలు మొలిచిన పొలాల్లా ఉండేవి. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు అయితే అర్ధరాత్రి ఊరి సెంటర్ లో టీ తాగడానికి అని పోతూ పోతూ తన ఇంటి రోడ్డు ముందు నిద్రపోతున్న మనిషిని మంచంతో సహా లేపుకు వెళ్ళి మరో ఇంటిముందు దింపేవాళ్ళం, కొంటెగా. ఆ ఇంటి ముసలమ్మ మా ఇంటి ముసలమ్మతో రాత్రంతా కబుర్లు చెప్పుకోడానికి మనవడితో మంచం మోపించుకు వచ్చి ఈ మంచం పక్కన ఆ మంచం కుదిర్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవారు. పిల్లలూ అంతే చంకలో దుప్పటి దిండు పెట్టుకుని పక్కింటి నేస్తుడితో మహా మహా ముచ్చట్లు ఆడటం లేదా రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం వింటూ అక్కడే బజ్జోడం. అర్థరాత్రి దాటాకా మనుషులు, మంచాలే కాదు మా ఊరి రహదారులూ, జట్కా బళ్ళు, సైకిల్ రిక్షాలు అన్నీ నిద్ర పోయేవి. కేవలం కీచు రాళ్ళ చప్పుడు, లేదా అప్పుడప్పుడు కప్పల బెకబెకలు. ఇప్పుడు రోడ్డులకు అసలు నిద్ర లేదు. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక బండి గాన్లు దాన్లను తొక్కుతూనే పోతుంటాయి. హారన్లు రోడ్డులను దోమల్లా కుడుతూనే ఉంటాయి) మధ్యాహ్న భోజనానంతర నిద్ర మేల్కొన్న తర్వాత హాయిగా మేం వీధి అరుగులపై కూచుని కేవలం కబుర్లు చెప్పుకుంటాం. ముచ్చట్లు ఆడుకుంటాం. దారిన పోయే అందరి యోగక్షేమాలు విచారిస్తాం "ఏం బ్బా! మీ అల్లుడు ఎలా ఉన్నాడు, మీ భార్య, కోడలు ఎలా ఉన్నారు, మీ కోడి, మేకా ఎలా ఉన్నాయి" ఊళ్ళో జనాలకు ఏం ఉన్నా లేకపోయినా చాలా సమయం ఉండేది. వారికి తమతో తాము ఉండటానికి సమయం ఉంది. తమతో తాము ఉండటానికి సమయం ఉన్నప్పుడు మనిషికి తనను తాను అర్థం చేసుకోడానికి సమయం ఉంటుంది. ప్రజలు తమను తాము అర్థం చేసుకున్నప్పుడు వారు తమ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో సులభంగా, స్పష్టంగా గ్రహించగలరు. చాలా మంది ప్రజలు తమకు ఆనందం కావాలి, ప్రేమ కావాలి.. తమ జీవితాలను హాయిగా సంపూర్ణంగా ఆస్వాదించాలని కోరుకుంటారు, తీరిక, తీరుబడి ఉన్న ప్రజలు తమ జీవితంలో చాలా అందాలను చూస్తారు కాబట్టి వారు ఆ అందాన్ని అనేక విధాలుగా వ్యక్తం చేసేవారు. కొంతమంది హాయిగా ఇంటి బయట కూచుని తమ కత్తి పిడిని నునుపు చేసుకునే వారు, వాటిపై బొమ్మలు చెక్కేవారు, బుట్టా, గంప చక్కగా అల్లుకునేవారు, తడికలకు, చాటలకు కాగితపు గుజ్జు పసుపు అలికేవారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. ప్రజలు ప్రతి చోటా ప్లాస్టిక్‌ని ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ పీలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ జీవితంలో ఏదో తప్పు ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నేను ఈ విధంగా జీవించలేను కాబట్టి నేను యూనివర్సిటీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకని తిరిగి నా చిన్న ఊరికి తిరిగి వెళ్ళాను. నేను ఇంటికి తిరిగి వచ్చి నేను చిన్నతనంలో ఉన్నట్లుగా, నాకు గుర్తుండేలా జీవించడం మొదలుపెట్టాను. నేను ఇక్కడ సంవత్సరానికి రెండు నెలలు పని చేయడం ప్రారంభించాను. వ్యవసాయంలో నాకు నాలుగు టన్నుల బియ్యం వచ్చింది. మేము మొత్తం మా కుటుంబంలో ఉన్నది ఆరుమందిమి. మేమంతా కలిపి సంవత్సరానికి అర టన్ను కంటే తక్కువ తింటాము. కాబట్టి మిగిలిన బియ్యాన్ని అమ్మవచ్చు. ఇంకా నేను రెండు చిన్న చేపల చెరువులు తీసుకున్నాను. మాకు ఏడాది పొడవునా తినడానికి హాయిగా చేపలు ఇక్కడ దొరుకుతాయి. అంతే కాక నేను నాకున్న అర ఎకరం కంటే తక్కువ చిన్న స్థలంలో ఒక చిన్న తోటను కూడా వేసాను. తోట పని కోసం రోజుకు 15 నిమిషాలు గడుపవలసి వస్తుంది. నేను ఈ తోటలో 30 కంటే ఎక్కువ రకాల కూరగాయలను పండిస్తున్నాను. అన్ని కూరగాయలను మేం ఆరుగురం ఎట్లాగో తినలేం కాబట్టి మాకు కావలసినవి కొన్ని ఉంచుకుని మిగతా వాటిని మార్కెట్లో అమ్మడం వల్ల కొంత ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. జీవితం ఇక్కడ చాలా సులభం. నేను ఏడేళ్లపాటు బ్యాంకాక్‌లో ఉండాల్సి వచ్చింది. గంటల తరబడి కష్టపడి పని చేశాను, అంత కష్టపడి పని చేసినా సంపాదించుకున్నది తినడానికి సరిపోలేదు.. కానీ ఇక్కడ, సంవత్సరానికి రెండు నెలలు మరియు రోజుకు 15 నిమిషాలు మాత్రమే పనిచేసి నేను ఇంట్లో ఆరుగురికి ఆహారం ఇవ్వగలను. జీవితం అంటే సులువుగా ఉండటం. ఇంకో ముఖ్యమైన విషయం. చిన్నతనంలో స్కూల్లో ఎప్పుడూ మంచి గ్రేడ్ సాధించని నాలాంటి తెలివితక్కువవారికి జీవితంలో ఇల్లు అనేది రాసిపెట్టి ఉండదని నేను అనుకున్నాను. నేనే కాదు ఇది చాలామంది అభిప్రాయం కూడా. ఎందుకంటే నాకంటే తెలివైనవారు, ప్రతి సంవత్సరం క్లాసులో నంబర్ వన్ అయిన వారు మంచి ఉద్యోగం పొందుతారు. మంచి ఉద్యోగం వల్ల మంచి వేతనం లభిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఒక స్వంత ఇల్లు పొందడానికి అత్యంత అర్హులు. కానీ నాకు, నావంటి యూనివర్సిటి చదువు పూర్తి చేయలేని వారు కూడా ఒక ఇంటిని కలిగి ఉంటారా? నాలాంటి, తక్కువ విద్య ఉన్న వ్యక్తులకు ఇల్లు అనేది ఒక ఆశాజనకపు ఎప్పటికీ పూర్తి కాని కల. కానీ, ఇక్కడ నా పేద గ్రామంలో నాకడుపుకు, కుటుంబ అవసరాలకు ఆహార ఉత్పత్తి సాధించిన నేను ఇప్పుడు భూసంబంధమైన భవనాలు చేయడం ప్రారంభించాను, ఇళ్ళు కట్టడం అంటారా అది చాలా సులభం అయింది నాకు ఇక్కడ. నేను రోజూ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, రెండు గంటల సమయం ఇల్లు కట్టడానికి వెచ్చించాను. మూడు నెలల సమయంలో నాకు స్వంత ఇల్లు వచ్చింది. మట్టి, రాయి, గడ్డి, వెదురు కలిస్తే ఇల్లు. నేను చదువుకునేప్పుడు నా క్లాస్‌లో అత్యంత తెలివైన స్నేహితుడు ఒకరు, అతను తన ఇంటిని నిర్మించడానికి నాకు లాగానే మూడు నెలల సమయం తీసుకున్నాడు. ఆ ఇంటికి గృహ సంబంధమైన వస్తు సంచయంతో పాటు అప్పులూ చేయాల్సి వచ్చింది. అతను 30 సంవత్సరాల పాటు తన అప్పు చెల్లించాలి. కాబట్టి, అతనితో పోలిస్తే, నాకు 29 సంవత్సరాల 10 నెలల ఖాళీ సమయం అనేది మిగిలింది. జీవితం అనేది సులభమైనది. ఈ సులభమైన జీవితాన్ని దానిపై అప్పులు, వడ్డీల ఋణం వేసి బరువుగా ఎందుకు బ్రతుకుతున్నాము మనం. నా మొదటి ఇల్లు కట్టేంత ముందు వరకు కూడా అంత తేలికగా, సులువుగా ఒక ఇల్లు నిర్మించవచ్చని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు కనీసం ప్రతి సంవత్సరం నేను ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కానీ ఇల్లు మాత్రం నాకు చాలా ఉన్నాయి. సమస్య అల్లా ఈ రాత్రి నేను ఏ ఇంట్లో నిద్ర పోవాలి అనేదే. కాబట్టి, ఇల్లు అనేది ఒక సమస్య కాదు, ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు. మా దగ్గర చిన్న పిల్లలు, 13 సంవత్సరాల వయస్సు వాళ్ళు ఒక పాఠశాల కట్టుకున్నారు. అదీను వారు స్వంతంగా చేసుకున్న ఇటుకలను ఉపయోగించి తరువాత నెలలో ఆ పాఠశాలకు ఒక లైబ్రరీ కూడా. కాబట్టి ఇల్లు కట్టుకోడం పెద్ద విషయం కాదు మమ్మల్ని చూసి ఒక ముసలి సన్యాసిని కూడా ఆమె కోసం ఒక గుడిసెను నిర్మించుకున్నది కాబట్టి జీవితం లాగే, ఇల్లూ కూడా సులభం, మీరు నన్ను నమ్మకపోతే పోనీ, మీరూ ఒకమారు ప్రయత్నించండి. జీవితం అంటే, నివాసం అంటే, హాయిగా బ్రతకడం చాలా సులువు. ఇంటి తరువాత తదుపరి విషయం దుస్తులు. నేను అందగాడిని కాదు కాబట్టి అందంగా కనిపించడానికి ఖరీదయిన దుస్తులు ధరించడం ఒక మార్గం అనిపించింది. బాగా కనిపించడం కోసం. నేను నాకు నచ్చిన ఒక సినీ నటుడిలా దుస్తులు ధరించడానికి ప్రయత్నించాను. అందుకని ఒక జత జీన్స్ కొనడానికికని డబ్బు ఆదా చేయడానికి ఒక నెల బాగా కష్టపడ్డాను. చివరికి ఆ దుస్తులు కొని వాటిని ధరించి అద్దంలో చూసుకుంటూ నేను ఎడమవైపు నుండి కుడివైపుకు తిరిగాను. కుడి నుండి ఎడమవైపుకు మళ్ళాను. అద్దంలో నా చుట్టూ నేను తిరిగాను. నేను చూసిన ప్రతిసారీ నేను ఒకే వ్యక్తిని, ఆ పాత నేనుని మాత్రమే చూసాను. ఒక నెలపాటు చెమట రక్తం ధారవోసి కొన్న అత్యంత ఖరీదైన ప్యాంటు, చొక్కా కూడా నా మొహాన్ని, జీవితాన్ని మార్చలేదు. అద్దంలో కనబడిన నాకు నేను చాలా వెర్రివాడిని అనిపించింది. ఖరీదయిన దుస్తుల కొసం, అత్యంత ఆధునిక పొకడల వస్త్రాల వెంట పరిగెట్టి డబ్బు ఎంతగానయినా కూడపెట్టండి. అది మనల్ని ఏమాత్రం మార్చలేదు. నేను దాని గురించి మరింత తెలుసుకోవడం, ఆలోచించడం మొదలుపెట్టాను. మనం ఎందుకని ఫ్యాషన్‌ని అనుసరించాలి? ఆలోచించిన కొద్ది నాకు జవాబు దొరకలేదు. వంటిని కాపాడటమే దుస్తుల కేవల ఉద్దేశం. ఆ తర్వాత, 20 సంవత్సరాల వరకు, నేను ఏ బట్టలు కొనలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న బట్టలన్నీ ప్రజల నుండి వచ్చినవే ప్రజలు నన్ను సందర్శించడానికి వచ్చినప్పుడు, మరియు వారు ఇక్కడి నుండి వెళ్ళేప్పుడు వారు ఇక్కడ చాలా దుస్తులను వదిలివేస్తారు. కాబట్టి నా దగ్గర ఇప్పుడు టన్నుల కొద్దీ బట్టలు ఉన్నాయి. ఏం చేస్తాం? వద్దనుకున్నవి ఎంత ఉండినా ఏం ప్రయోజనం. ఇలా ఆలోచించినప్పుడు నాకు మరింత స్వేచ్ఛగా అనిపిస్తుంది. అవసరానికి మించి ఏదీ వద్దు అనుకోవడంలో ఉన్నస్వేచ్చ మరి ఎందులో లేదు. ఇక చివరి విషయం ఏమిటంటే, అనారోగ్యం. నేను జబ్బుపడినప్పుడు సంగతి. అప్పుడు ఏమి చేయాలి? నేను నా పాత జీవితాన్ని కొత్త గా మొదలు పెట్టేముందు అంత సులువుగా మొదలు కాలేదు, దాని గురించి చాలా ఆందోళన చెందాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, మందు మాకులు, వైద్యం, ఆస్పత్రి.. వీటి ఖర్చులు! నేను దీని గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను, మానవుడికి అనారోగ్యం సాధారణమైనది, అనారోగ్యం అంత చెడ్డ విషయం ఏమీ కాదు. అనారోగ్యం అయింది అంటే దాని అర్థం- మన జీవితాల్లో, మనం గడుపుతున్న జీవిత విధానంలో మనం ఏదో తప్పు చేశామని మన శరీరం మనకు గుర్తుచేసే విషయం. అందుకే మనం అనారోగ్యానికి గురవుతాము. కాబట్టి, నాకు జబ్బు వచ్చినప్పుడు, నేను కాస్త ఆగిపోయి నా దగ్గరకు నేను రావాలి. దాని గురించి కాస్త ఆలోచించాలి. ఇదిగో ఇది నేను చేసిన తప్పు. కాబట్టి ఈ తరహా పని మరలీ చేయరాదు. డబ్బు లేకపోతే ఏవుంది, నన్ను నేను నయం చేసుకోవడానికి నీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. భూమి, దాని మన్ను నన్ను స్వస్థపరచడానికి ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. నాకు ఇది ఆరోగ్య స్వేచ్ఛ లాంటిది అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఉన్న జీవిత విధానంలో స్వేచ్ఛగా ఉన్నాను. నేను దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందను. నాకు భయం తక్కువ, నా జీవితంలో నేను కోరుకున్నది నేను చేయగలను. మునుపు గడిపిన బ్యాంకాగ్ జీవితం నాకు చాలా భయం కల్పించింది, దాని నీడన నేను ఏమీ చేయలేకపోయాను. కానీ, ఇప్పుడు నేను స్వేచ్ఛగా భావిస్తున్నాను, నన్ను నేను ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా అనుకుంటున్నా, నాలాగా ఎవరూ లేరు, నన్ను నేను ఎవరిలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. విజయానికి అడుగెట్టాల్సిన ఏ మెట్టు వెదకవలసిన అవసరం లేదు. నన్ను పోగొట్టుకుని ఎవరినో ధరించడానికని పూనుకుని అన్వేషణకు బయలుదేరాల్సిన అవసరమూ లేదు. ఆహారం, ఆవాసం, ఆరోగ్యం ఆ తర్వాత ఇక ఏం చేయాలి? నేను బ్యాంకాక్‌లో ఉన్నప్పటి జీవితపు మనస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, నా జీవితంలో అప్పుడు చాలా చీకటిగా అనిపించింది. ఆ సమయంలో చాలా మంది నాలాగే ఆలోచిస్తారని, అలోచిసూ ఉంటారని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కాబట్టి, నావంటి భావసారూప్యత కల వారిమి కలిసి చింగ్ మాయిలో "పన్ పన్ 'అనే కార్యశాలని ప్రారంభించాము (చియాంగ్ మాయి పర్వత ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఒక నగరం.) మా ఆలోచనల ప్రధాన లక్ష్యం కేవలం విత్తనాన్ని సేకరించడమే! విత్తనాన్ని కాపాడటమే.! విత్తనం అంటే ఆహారం, ఆహారం అంటే జీవితం. విత్తనం లేకపోతే, జీవితం లేదు. విత్తనం లేదంటే స్వేచ్ఛ లేదు. విత్తనం లేకపోతే ఆనందం లేదు. ఎందుకంటే మన జీవితం ఆహారం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని కాపాడటం చాలా ముఖ్యం. అందుకే విత్తనాల పొదుపుపై దృష్టి పెట్టాం. ఇది "పన్ పన్లో "ప్రధానమైనది. విత్తనం తరువాత రెండవ విషయం ఏమిటంటే ఒక కూడిక కేంద్రాన్ని నెలకోల్పడడం. ఇది ఒక అభ్యాస కేంద్రం. ఇదెందుకు అంటే, మనం జీవితాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి, జీవితాన్ని సులభతరం చేసుకోడం తెలుసుకోవడానికి అన్నమాట. ఎందుకంటే మనం ఈ జీవితాన్ని వీలయినంత సంక్లిష్టంగా మరియు గొప్ప కంగాళిగా ఎలా గడపాలో నేర్పించాము. దానిని ఇప్పుడు ఆ సంక్లిష్టత బారినుండి విముక్తం చేయాలి. జీవితాన్ని ఎలా సులభతరం చేయవచ్చు? చేయడం సులభం, కానీ ఎలా సులభతరం చేయాలో చెప్పడం మాకు తెలియదు. ఎందుకంటే మనం దానిని విముక్తం చేయడానికి సూత్రాలు సులువుగా దొరకనంత చిక్కుగా చేసాము. గొలుసుల మీద గొలుసులు, ముడుల మీద ముడులు, వస్తువుల మీద వుస్తువులు... చెత్త చేసాము మనం జీవితాన్ని. అందుకని ఇప్పుడు ముడులు విప్పడం నేర్చుకోవడం మొదలుపెడదాము. అందరం కలిసి ఉండడం నేర్చుకుందాము. అన్నిటి నుండి డిస్కనెక్ట్ కావడం నేర్చుకుందాము. మనం సంతోషంగా ఉండాలంటే, మన ఆలోచనా స్వేచ్చ మనకు తిరిగి రావాలి అందుకని మళ్లీ మనతో మనం కనెక్ట్ అవ్వాలి, ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలి, మన మనస్సు మరియు శరీరాన్ని మళ్ళీ కలపాలి. జీవితం అనేది సులభం. దానిని చూసి భయపడకండి. వెనక్కి రండి. మొదలు నుండి ఇప్పటి వరకు, నేను నేర్చుకున్నది నాలుగు ప్రాథమిక అవసరాలు: ఆహారం, ఇల్లు, బట్టలు మరియు వైద్యం. ఈ నాలుగు- ప్రపంచంలో అందరికి చౌకగా మరియు అందుబాటులోకి సులభంగా ఉండాలి. నాకరికత అంటే అర్థం అదే. కానీ మనం వందలూ, వేలు కాదు ఈ కేవల నాలుగు సంఖ్హ్యల విషయాలను పొందడానికి ఈ భూమి మీద నివసించే అనేక మందికి కష్టతరం చేసి పెట్టాము. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ విధంగా నాగరికమైనదో దానిని చూసి మనం ఎలా గర్వంగా పడగలమో నాకు తెలియడం లేదు. ఈ భూమిపై ఇప్పుడు ఉన్నది అత్యంత నాగరికమైన యుగం అని భావించేవారు ఉన్నారు. భూమిపై చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మన దగ్గర మహా మహా విశ్వవిద్యాలయాల చదువు పూర్తి చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ భూమిలో అసాధారణమైన అత్యంత తెలివైన వ్యక్తులు ఉన్నారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు.. ఒక్కరని కాదు, రకరకాలు. కానీ, జీవితం ఎలా ఉంది అంటారు? కష్టంగా ఉంది కష్టాతి కష్టంగా ఉంది. ఇంత కష్టం మనం ఎవరి కోసం పడుతున్నట్టు? దేనికోసం పరిగెడుతున్నట్లు? ఈ నడుస్తున్న జీవన వ్యాకరణం తప్పు అని నాకు అనిపిస్తోంది, ఈ తరహా జీవన విధానం సాధారణమైనది కాదు, ప్రాకృతమైనది కాదు. కాబట్టి, నేను దానినుండి సాధారణ మానవ స్థితికి రావాలనుకుంటున్నాను. మనిషి ఒక సాధారణత్వానికి మరలిపోవాలి. అతను జంతువులతో సమానంగా ఉండాలి. అవును మీరు సరిగా చదివారు. జంతువులతో సమానంగా పక్షులు ఒకటి లేదా రెండు రోజుల్లో గూడు కట్టుకుంటాయి. ఎలుక ఒక్క రాత్రిలో తన నివాస రంధ్రం చేస్తుంది. కానీ సృష్టిలో మనలాంటి తెలివైన మనుషులు ఒక ఇంటి కోసం 30 సంవత్సరాలు గడుపుతారు. అప్పులు చేసి మరీ జీవితాన్ని క్లిష్టతరం చేసుకుంటారు. ఇంత కష్టమైన జీవితంలో కూడా ఈ భూమి మీద వసించే చాలామంది వ్యక్తులకు తమ జీవితంలో ఒక ఇంటిని కలిగి ఉంటారని నమ్మలేము. కాబట్టి ఇదంతా తప్పు జరుగుతుంది. మనం మన ఆత్మను ఎందుకు నాశనం చేసుకుంటున్నాము? మనం మన సామర్థ్యాన్ని ఎందుకు అంతగా నాశనం చేసుకుంటున్నాము? ఈ ఆలోచనలో నన్ను నేను వెదుక్కుంటూ వెనక్కి వచ్చాను. నేను ఒక సాధారణుడ్ని అయ్యాను అనుకుంటున్నాను. మీరంతా సాధారణ మార్గంలో అనుకునే ఒక అసాధారణమైన రీతిలో జీవిస్తున్నారు. మీకు తెలియదు, మీకు మీ గురించి ఆలోచించే సమయం, స్వేచ్చ లేదు. నిజానికి ఇప్పుడు ఈ రోజు నేను సాధారణంగా ఉండటానికి, మామూలుగా బ్రతకడానికి, సహజంగా ఉండేలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రజలు నన్ను ఒక అసాధారణ వ్యక్తి అనుకుంటున్నారు లేదా పిచ్చివాడు, కానీ అదేమీ నేను పట్టించుకోను. ఎందుకంటే అది నా సమస్య కాదు వారి సమస్య. జీవితం నాకు ఇప్పుడు సులభంగా, తేలికగా ఉంది. అది నాకు చాలు. అది నాకు చాలా ఎక్కువ. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు. వారు అనుకోడాన్ని, వారి అభిప్రాయాలను మార్చడానికి, నచ్చచెప్పడానికి నేను ఏమీ చేయలేను. నేను చేయగలిగేది ఒక్కటే, నన్ను, నా మనసును మార్చుకోవడం. నా మనస్సును నేనే నిర్వహించుకోవడం. ఎంపిక అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఎన్నిక. మీకు ఏం కావాలో మీరు మీరు ఎంపిక చేసుకోవచ్చు. సులభంగా నుండి కష్టంగా ఉండటానికి ఎంపిక. కష్టంగా నుండి సులభంగాఉండటానికి ఎంపిక, అది మీ పై ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) -
ఒక పేజీలో టాక్స్ ఫైలింగ్ ఎలా?
ఒకపుడు ఆదాయ పన్ను దాఖలు చేసే పద్ధతి చాలాకష్టంగా ఉండేది. సామాన్య మానవుడికి మరీ కష్టంతో కూడుకున్న పని. పన్ను రిటర్న్స్ దాఖలులో ఈ-ఫైలింగ్ ఈ ప్రక్రియ కొంత సులభమైందనే చెప్పాలి. తాజాగా ప్రవేశపెట్టిన ఒక పేజీలో వ్యక్తిగతంగా ఆదాయం పన్ను దాఖలు చేసే పద్ధతి మరింత సులభం. మొదట14 పేజీలుగా ఈ ఫైలింగ్ విధానాన్ని మార్చి గతంలో మూడు పేజీలకు తగ్గించారు. ఇక ఇప్పటినుంచి ఆన్లైన్లో టాక్స్ ఫైలింగ్ చేసేవారు కేవలం ఒక పేజీలో వివరాలు పూర్తి చేస్తే చాలు. వారి పాన్‌కార్డు నంబర్, వ్యక్తిగత వివరాలు, పన్నుల చెల్లింపు వివరాలు తెలిపితే సరిపోతుంది. మిగితా సమాచారం తనంతట తానే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ సమకూర్చుకుంటుంది. ఏప్రిల్ 1,2017, ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ముఖ్యంగా సాలరీడ్ వ్యక్తులకు గణనీయంగా సులభతరమైంది. ఐటిఆర్ ఫాం నింపేందుకు సింపుల్ స్టెప్స్ ఇపుడు చూద్దాం. 1) ఐటి శాఖ పన్ను దాఖలు వెబ్ సైట్ లో ముందుగా రిజిస్టర్ కావాలి. 2) మీ పాన్ కార్డ్, ఆధార్ నంబర్‌ను పూరించాలి. తాజా నిబంధనల ప్రకారం ఆధార్ నెంబరు దాఖలు తప్పనిసరి. 3) మీ వ్యక్తిగత వివరాలు మరియు పన్నులు చెల్లించిన సమాచారాన్ని పూరిస్తే..టీడీఎస్(టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాలు ఆటోమేటిగ్గా పూర్తవుతాయి. 4) దీంట్లో రెండు మార్గాలు ఉన్నాయి. వివరాలు పూరించి ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు లేదా సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయొచ్చు. 5) ఒకవేళ ఆఫ్‌లైన్ లో అయితే సంబంధిత ఐటి రిటర్న్స్‌కు కావాల్సిన పత్రాల ఎక్స్ఎంఎల్ వెర్షన్ కాపీలను అప్లోడ్ చేయాలి. 6) ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, ఐటి ఫైలింగ్ ను నిర్ధారిస్తూ ఒక మెసేజ్ వస్తుంది. -
అరటి.. ఆలు.. లైటు!
మనం రోజూ వాడే ఆలుగడ్డ... గెలలు కోసేసిన తరువాత నరికి పారేసే అరటి బోదె... కరెంటు ఉత్పత్తి చేసే బ్యాటరీలుగా మారగలవా? ఓ... ఎస్ అంటున్నారు అంటున్నారు శాస్త్రవేత్తలు! వినడానికి చాలా సింపుల్ వ్యవహారం అనిపిస్తుందిగానీ... వ్యవహారం చాలా సీరియస్సే. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలోనూ కరెంట్ అంటే ఏమిటో తెలియని వాళ్లు ప్రపంచమంతా 200 కోట్ల మంది ఉన్నారు మరి. మారుమూలన ఉండటం కావచ్చు, పేదరికం కావచ్చు... ఇంకో కారణం ఉండవచ్చుగానీ ఇది నిష్టూర సత్యం. వీరందరికీ విద్యుత్ వెలుగులు అందించేందుకు జరగని ప్రయత్నమూ లేదు. సౌరశక్తి ఖరీదెక్కువ.. పవనవిద్యుత్తుతోనూ ఇబ్బందులే. ఈ నేపథ్యంలో ఎక్కడైనా సరే... స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలతోనే విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలపై శ్రీలంక, సౌదీ అరేబియాల్లోని శాస్త్రవేత్తలు కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫలితంగా పుట్టుకొచ్చాయి... ఈ అరటి, ఆలు బ్యాటరీలు! నిజానికి ఆలుగడ్డలతో బ్యాటరీలు తయారు చేయడం కొత్తేమీ కాదు. అమెరికా లాంటి దేశాల్లో స్కూలుపిల్లలు తమ సైన్స్ ప్రాజెక్టుల్లో భాగంగా చేస్తూనే ఉన్నారు. ఉడకబెట్టిన ఆలుగడ్డలోకి జింక్, రాగి మేకుల్ని జొప్పించి తగిన విధంగా వైర్లతో కలిపితే చిన్నస్థాయిలో కరెంటు పుడుతుంది. ఆలుగడ్డలోని ఫాస్పారిక్ ఆమ్లం మేకులతో జరిపే చర్యల ఫలితమిది. కాకపోతే నాలుగేళ్ల క్రితం బెర్క్లీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొందరు ఏ పరిస్థితుల్లో ఆలుగడ్డ నుంచి అత్యధిక విద్యుత్తు రాబట్టవచ్చు? ఏవైనా ఇబ్బందులున్నాయా? అన్న అంశాలపై పరిశోధనలు జరిపారు. ఉడకబెట్టిన ఆలుతో పోలిస్తే దాన్ని నాలుగైదు ముక్కలుగా చేసి లోహపు పలకల మధ్య ఉంచడం ద్వారా పదిరెట్లు ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని వీరు నిరూపించారు. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త సులేమాన్ అబ్దుల్లా మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియను ప్రామాణీకరించారు. సాధారణ 1.5 వోల్టుల బ్యాటరీతో పోలిస్తే ఆలుగడ్డ బ్యాటరీ రెట్టింపు సామర్థ్యంతో పనిచేస్తుందని, అదేసమయంలో 26 రెట్లు చౌకగా లభిస్తుందని అబ్దుల్లా అంటున్నారు. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే తాము వాణిజ్యస్థాయిలో ఈ బ్యాటరీలకు అవసరమైన పరికరాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీలంకలో అరటితో... బెర్క్లీ శాస్త్రవేత్తల ప్రయోగాలు ఈ రంగంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని పెంచాయి. శ్రీలంకలోని కెలనాయా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త కె.డి.జయసూర్య తమదేశంలో ఖరీదైన ఆలుగడ్డలకు మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? అని వెతకడంతో అరటిబోదె సామర్థ్యం వెలుగు చూసింది. అరటిబోదె మధ్యభాగాన్ని ఉడికించి సన్నగా తరిగి లోహపు ప్లేట్ల మధ్య ఉంచి బ్యాటరీని రూపొందించవచ్చునని ఆయన ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ఆలుగడ్డతో పోలిస్తే ఇది మరింత చౌకైన విధానం కావడం విశేషం. పైగా వృథాగా పారవేసే అరటిబోదెకు కొత్త ప్రయోజనం కల్పించారీయన. ఒక చిన్న బోదె ముక్కతో ఒక ఎల్ఈడీ బల్బును 500 గంటలపాటు వెలిగించవచ్చునని జయసూర్య అంటున్నారు. యానిమేషన్లూ కారణమే... కొన్ని నెలల వాడకంతో స్మార్ట్‌ఫోన్ నత్తనడకన నడిచేందుకు యానిమేషన్లూ ఒక కారణం. అయితే వీటిని డిజేబుల్ చేసే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. సెట్టింగ్స్‌లోని అబౌట్ ఫోన్ ఆప్షన్లో బిల్డ్ నెంబర్ అనే ట్యాబ్ ఒకటి ఉంటుంది. దీన్ని ఏడుసార్లు ట్యాప్ చేశారనుకోండి.. డెవలపర్ ఆప్షన్స్‌ను వాడుకునే వీలేర్పడుతుంది. దీంట్లో డ్రాయింగ్ ఆప్షన్స్‌ను ఎంచుకుని విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్‌ను ఆఫ్ చేసేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలోనే యానిమేషన్లన్నీ నిలిచిపోతాయి. -
చుట్టిన కొద్దీ అందం
కొన్ని వస్తువులు సాదా సీదాగా కనపడితే చూడ్డానికి అంత బాగుండవు. ఇక అవి గనుక గాజు సీసాలైతే పొరపాటున జారితే పగిలిపోతాయేమో అని భయం ఉంటుంది. అదే పురికొసతో, పల్చటి నారతోనూ, ఊలు దారాలతో ఇలా చుట్టేశారనుకోండి. పట్టుకుంటే బాటిళ్లు గ్రిప్ కోల్పోవు. జారి పడతాయేమో అనే భయం ఉండదు. పైగా సీసాలు ఇలా అందంగా కనువిందు చేస్తాయి. సింపుల్‌గా అనిపిస్తూ, సూపర్బ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ ఐడియాను అమలులో పెట్టడానికి ఎందుకు ఆలస్యం. ‘చుట్టూ చుట్టూ.. చుట్టూ చుట్టూ చుట్టూ నన్నే చుట్టూ...’ అంటూ ఓ పాటందుకొని ఊలుదారంతో, లేదంటే పురికొసతోనూ సీసాలను, డబ్బాలను ఇలా చకాచకా చుట్టేయండి. చుట్టే ముందు కలర్ కాంబినేషన్స్ చూసుకోండి. అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేయండి. ఇందుకు కావలసినవి : ఊలు లేదా పురికొస; అతికించడానికి గమ్; కత్తెర; గ్లౌజ్ (చేతులకు వేసుకోవడానికి) తయారీ: బాటిల్ అడుగున గమ్ రాసి, ఊలు దారం అతికించాలి. ఆ తర్వాత గమ్ పూస్తూ, ఒక్కో వరస దారం అతికిస్తూ బాటిల్ చుట్టూ చుట్టాలి. ఇలా చేస్తే దారం వదులుగా అవడం, బయటకు రావడం వంటివి లేకుండా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా పూర్తిగా గమ్ పూస్తూ ఊలును, పురికొసను చుడుతూ అతికించిన తర్వాత, మిగిలిన దారాలను కత్తిరించి, ఒక రాత్రి మొత్తం అలాగే ఉంచాలి. గమ్ ఆరిన తర్వాత వాడుకోవడానికి వీలుగా ఉంటుంది.